News July 7, 2024
అమరావతిలో ORR విశేషాలు ఇలా.!
ఉమ్మడి గుంటూరు జిల్లా CRDA పరిధిలో 189 KM పొడవున ORR నిర్మాణం జరగనుంది. 150 మీటర్ల వెడల్పుతో 2 వైపులా సర్వీస్ రోడ్లు కాకుండా 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో నిర్మాణం పూర్తయితే కొల్లిపర, పొన్నూరు, తెనాలి, చేబ్రోలు, వట్టిచెరుకూరు, గుంటూరు, మేడికొండూరు, యడ్లపాడు, తాడికొండ, పెదకూరపాడు, అమరావతి మండలాల్లోని 38 గ్రామాల మీదుగా ORR వెళ్లనుంది.
Similar News
News December 10, 2024
వైసీపీ రైతు ఉద్యమం పోస్టర్ విష్కరణ
ఏపీలో రైతుల సమస్యలపై డిసెంబరు 13న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ ఉద్యమం చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ ఉద్యమం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితర నేతలు పిలుపునిచ్చారు.
News December 10, 2024
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి కంచె తొలగింపు
తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఇంటికి రక్షణ కోసం నిర్మించిన ఇనుప కంచెలో కొంత భాగాన్ని సోమవారం తొలగించారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో భద్రత కోసం తాడేపల్లిలోని తన ఇంటి ప్రహరీ గోడకు భారీ ఎత్తున ఇనుప కంచెను ఏర్పాటు చేయించుకున్నారు. వాస్తు ప్రకారం తూర్పు ఈశాన్య వైపు కంచె భాగాన్ని తొలగించినట్లు సమాచారం.
News December 10, 2024
తాడేపల్లి: ఫ్రెండ్ తల్లిపైనే అఘాయిత్యం..!
తాడేపల్లిలో ఆదివారం రాత్రి మహిళపై లైంగిక దాడికి తెగబడిన దుండగుడిని పోలీసులు 12 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. సీఐ కళ్యాణ రాజు మాట్లాడుతూ.. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు తెంపరల రామారావును సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మహిళ కుమారునితో ఉన్న స్నేహాన్ని అడ్డుపెట్టుకుని.. ఆమె ఇంటికి వచ్చి బలవంతం చేయగా ఆమె భయపడి పరుగులు తీశారు.