News July 16, 2024

అమరావతిలో ZSI పనులు ప్రారంభం

image

అమరావతి ప్రాంతంలోని రాయపూడి గ్రామంలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించనుంది. సోమవారం రాయపూడి పంచాయితీలో ప్రాథమిక అనుమతుల కోసం రుసుము చెల్లించి దరఖాస్తు చేసింది. ఈ సంస్థకు 2019 ఫిబ్రవరిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని 60 ఏళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయించారు. ఈ సంస్థ దేశంలోని వివిధ జంతు జాతులపై సర్వే చేస్తూ, వాటి మనుగడకు పరిశోధనలు సాగిస్తుంది.

Similar News

News October 6, 2024

ప్రజలపై టికెట్ రేట్ల భారం మోపము: ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల

image

ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ళ నారాయణరావు విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో అధికారుల సమక్షంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను సురక్షితంగా, సౌలభ్యంగా గమ్యాలకు చేర్చే సాధనం ఏపీఎస్ఆర్టీసీ అన్నారు. ఆర్టీసీకి నష్టం వచ్చినా, ప్రజలపై టికెట్ భారం వేయకుండా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పేదవారికి, మధ్య తరగతి వారికి ఆర్టీసీని అందుబాటులో ఉంచుతామన్నారు.

News October 6, 2024

విజయవాడ: దుర్గమ్మ రేపు ఏ అవతారంలో దర్శనమిస్తారంటే?

image

శరన్నవరాత్రులలో భాగంగా దుర్గమ్మ రేపు ఆదివారం నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ లలితా దేవి తనను కొలిచిన భక్తుల దారిద్ర దుఃఖాలు నశింపచేస్తుందని పండితులు తెలిపారు. చెరకుగడ, విల్లు, పాశము, అంకుశము ధరించిన అమ్మవారు భక్తుల ఇక్కట్లు తొలగించి, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందన్నారు.

News October 6, 2024

తిరుమలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది: ఎమ్మెల్యే సుజనా

image

వైసీపీ పదేపదే తిరుమలపై దుష్ప్రచారం చేస్తోందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా శనివారం ట్వీట్ చేశారు. ‘ఎందుకు తిరుమల అంటే మీకు అంత కోపం, హిందువుల మనోభావాలంటే అంత చులకన’ అంటూ వైసీపీని సుజనా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. డిక్లరేషన్ మీద సంతకం చెయ్యమంటే చెయ్యరు.. కానీ తిరుమల మీద దుష్ప్రచారం చేస్తారని సుజనా ఈ మేరకు జగన్‌ను ఉద్దేశించి Xలో పోస్ట్ చేశారు.