News November 4, 2024

అమరావతి అభివృద్ధికి తొలగిన అడ్డంకులు: మంత్రి

image

అమరావతి అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న పాత టెండర్లను క్లోజ్ చేసే మార్గం సుగమం అయ్యిందని మంత్రి నారాయణ అన్నారు. CRDAపై సీఎం సమీక్ష అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే నూతన టెండర్లను పిలిచే ప్రక్రియను ప్రారంభించి రానున్న మూడేళ్లలో అమరావతి అభివృద్ధి పనులను అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణాలకు జనవరి లోపు నూతన టెండర్లు పిలుస్తామని చెప్పారు.

Similar News

News December 6, 2024

చివరి దశలో పేద జీవితాన్ని గడిపిన సావిత్రి

image

తమిళ నటుడు జెమినీ గణేశన్ సావిత్రి ఫోటోలు తీయటంతో వారి పరిచయం పెళ్లిగా మారింది. అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. సావిత్రికి విజయ చాముండేశ్వరి అనే కూతురు, సతీశ్ కుమార్ అనే కొడుకు జన్మించారు. కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది. అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 1981 డిసెంబరు 26న 46 సంవత్సరాల వయసులో మరణించింది.

News December 6, 2024

మహానటి సావిత్రి పుట్టింది మన తాడేపల్లిలోనే

image

మహానటి సావిత్రి మన తాడేపల్లి మం. చిర్రావూరులో డిసెంబర్ 6, 1936న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. నేడు ఆమె జయంతి సందర్భంగా అభిమానులు ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. ఆమె చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకోగా.. పెదనాన్న వెంకట్రామయ్య ఆమెను పెంచి పెద్దచేశాడు. ఆమె చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలు పెట్టి అగ్ర కథానాయికగా ఎదిగి.. 250కన్నా ఎక్కువ సినిమాలలో నటించారు. 

News December 6, 2024

అమరావతిలో దెయ్యాలు అంటూ వదంతులు

image

అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇటీవల దెయ్యాలు సంచరిస్తున్నాయనే వదంతులు ప్రజల్లో భయాందోళనలను పెంచుతున్నాయి. అమరావతి నుంచి విజయవాడ వెళ్లే రోడ్డులోని ఓ పాతబడిన రెస్టారెంట్ వద్డ దెయ్యాలు కనిపించాయంటూ.. వారం రోజులుగా ఈ ప్రచారం జరుగుతోంది. చిన్నారులు, వృద్ధులు రాత్రి వేళ బయట తిరగడానికి భయపడుతున్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని అధికారులను కోరుతున్నారు.