News August 27, 2024

అమరావతి : ఏలేశ్వరం ఘటనపై మంత్రి లోకేశ్ ఆరా

image

కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఘటనపై మంత్రి నారా లోకేశ్ మంగళవారం అరా తీశారు. ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన తనను ఆందోళనకు గురి చేసిందన్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్భందీ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

Similar News

News September 14, 2025

GNT: నేడు ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్న వకుల్ జిందాల్

image

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10.30 గంటలకు డీపీఓలోని ఎస్పీ ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు తీసుకుంటారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన విజయనగరం నుంచి గుంటూరుకు బదిలీ అయ్యారు. ఎస్పీ బాధ్యతల స్వీకరణ కోసం పరిపాలనా సిబ్బంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

News September 14, 2025

గుంటూరు జిల్లాలో దంచికొట్టిన వర్షం

image

గుంటూరు జిల్లాలో శనివారం వర్షం దంచికొట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. మధ్యాహ్నం మొదలైన వర్షం పలు ప్రాంతాల్లో రాత్రి వరకు కురుస్తూనే ఉంది. వర్షంతో పాటు పిడుగులు, ఈదురుగాలులు కూడా వీయడంతో ప్రజలు అసౌకర్యం వ్యక్తం చేశారు. పిడుగులు పడి పెదనందిపాడు మండలంలో ఇద్దరు, పెదకాకాని మండలంలో మరో ఇద్దరు మహిళా కూలీలు మృత్యువాత పడ్డారు. పలు చోట్ల అధిక వర్షం కారణంగా కాలువలు నిండి నీరు రోడ్లపైకి చేరింది.

News September 14, 2025

గుంటూరు: నష్టపరిహారంగా రూ.1.11 కోట్లు

image

గుంటూరు జిల్లాలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 11,388 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. ఇందులో సివిల్ కేసులు 908, క్రిమినల్ కేసులు 10,480 ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీనివాసుల కుటుంబానికి రూ.1.11 కోట్లు పరిహారం అందజేయడం ప్రధానంగా నిలిచింది. ప్రజలు సమయం, డబ్బు ఆదా చేసుకునేలా ఈ వేదికను మరింతగా వినియోగించుకోవాలని జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి తెలిపారు.