News March 4, 2025
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో పల్నాడుకు మహర్దశ

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో పల్నాడు జిల్లాకు మహర్దశ పట్టనుంది. రింగ్ రోడ్డు పల్నాడు జిల్లాలోని అమరావతి మండలం లింగాపురం, ధరణికోట, దిడుగు, నెమలికల్లు, పెదకూరపాడు మండలంలోని మూసాపురం, పాటిబండ్ల, జలాలపురం, కంభంపాడు, తాళ్లూరు, లింగం గుంట్ల, కాశిపాడు గ్రామాల మీదగా వెళ్తుంది. జిల్లాల విభజనలో నాగార్జునసాగర్, పులిచింతల, అమరావతి, కొండవీడు, కోటప్పకొండ పల్నాడు జిల్లా పరిధిలోకి వచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News February 12, 2026
నార్త్ ఈస్ట్రర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో ఉద్యోగాలు

<
News February 12, 2026
KMR: జిల్లాలో కౌంటింగ్ బందోబస్తు సిద్ధం: SP

కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా జిల్లా వ్యాప్తంగా లెక్కింపు కేంద్రాల వద్ద 163 BNSS అమలులో ఉంటుందని SP రాజేశ్ చంద్ర వెల్లడించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. శాంతి సామరస్యాలను కాపాడేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
News February 12, 2026
నెల్లూరు: మినీ గోకులాల నిర్మాణాల్లో నిబంధనలకు తూట్లు..!

నిబంధనలకు విరుద్ధంగా మినీ గోకులాలు నిర్మాణాలు చేపట్టి రాయితీలు పొందుతున్నారు. కొండాపురం(M) ఇసకదామెర్లలో ప్రభుత్వ భూమిలో పోజిషన్ సర్టిఫికెట్స్‌ను అడ్డదారిలో పొంది సబ్సిడీపై షెడ్‌ను నిర్మిస్తున్నట్లు సమాచారం. పంచాయతీ పైపులు వెళ్లే మార్గంలో దీన్ని చేపట్టడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ అధికారులకు చెప్పినా స్పందించలేదట. ఉన్నతాధికారులు స్పందించకపోతే ఇలాంటివి పునరావృతమయ్యే అవకాశం ఉంది.


