News March 21, 2025

అమరావతి చిత్ర కళా వీధి పోస్టర్ ఆవిష్కరించిన పవన్

image

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి చిత్ర కళా వీధి పోస్టర్‌ను ఆవిష్కరించారు. గురువారం ఆయన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పొడపాటితో కలిసి ఈ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ ప్రత్యేకమైన కళా ఉత్సవం ఆంధ్రప్రదేశ్‌లోని కళాకారులందరికీ ఒక ఆశాకిరణంలా నిలుస్తుందని పేర్కొన్నారు.

Similar News

News December 5, 2025

కప్పు పట్టేస్తారా? పట్టు విడుస్తారా?

image

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన IND 3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచు గెలిచి ఊపు మీద కనిపించింది. దీంతో ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే అనుకున్నారంతా. కానీ బౌలింగ్ ఫెయిల్యూర్, చెత్త ఫీల్డింగ్‌తో రెండో వన్డేను చేజార్చుకుంది. దీంతో రేపు విశాఖలో జరిగే చివరి వన్డే కీలకంగా మారింది. మరి భారత ఆటగాళ్లు ఈ మ్యాచులో సమష్టిగా రాణించి, సిరీస్ పట్టేస్తారో లేక SAకు అప్పగిస్తారో చూడాలి.

News December 5, 2025

MEGA PTM 3.0 విజయవంతం: కలెక్టర్

image

ఎన్టీఆర్ జిల్లాలోని 914 పాఠశాలల్లో MEGA PTM 3.0 విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ లక్ష్మిశ తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని చెప్పారు. 67,271 తల్లిదండ్రులు, 5,098 ఉపాధ్యాయులు, 73,889 విద్యార్థులు, SMC సభ్యులు 11,204, పూర్వ విద్యార్థులు 1,073, ప్రజా ప్రతినిధులు 1,359, అధికారులు 1,065, ఇతరులు 11,613 మంది పాల్గొన్నారని తెలిపారు.

News December 5, 2025

ఎన్టీఆర్ జిల్లాలో తగ్గుతున్న రోడ్డు ప్రమాదాలు: కలెక్టర్

image

ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. 2024లో 1343 ప్రమాదాలు ఉండగా, 2025లో 918కి తగ్గాయని చెప్పారు. ప్రమాదాల్లో మూడొంతులు ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయని పేర్కొన్నారు. మద్యం తాగి నడిపితే కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. బ్లాక్‌స్పాట్‌లపై చర్యలు వేగవంతం చేస్తామన్నారు.