News October 18, 2024

అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024కు కేంద్ర మంత్రికి ఆహ్వానం

image

ఈ నెల 22, 23వ తేదీల్లో జరిగే అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024కు రావాల్సిందిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకి రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్, గురువారం ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సమ్మిట్‌కు దేశం నలుమూలల నుంచి వందల కంపెనీలు వందలాది మంది డెలిగేట్స్ అమరావతికి రానున్నారు. ఆహ్వానించిన వారిలో ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ MD కె. దినేష్ కుమార్ ఉన్నారు

Similar News

News December 16, 2025

గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యారావు?

image

గుంటూరు జిల్లా TDP అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యారావు పేరు అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (LIDCAP) చైర్మన్‌గా పనిచేస్తున్నారు.

News December 16, 2025

GNT: గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులు అరెస్ట్

image

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గంజాయి మూలాలను కూకటివేళ్లతో పెకలించి వేస్తున్నామని DSP అబ్దుల్ అజీజ్ అన్నారు. పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతీనగర్ అబ్దుల్ బాబా మసీదు ఎదురు ఖాళీస్థలంలో ఐదుగురు యువకులు గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నారు. పాతగుంటూరు పోలీసులు అరెస్ట్ చేయగా కేసు వివరాలను DSP వివరించారు. వారి వద్ద నుంచి 20గ్రాముల గంజాయి, 4 గ్రాముల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

News December 16, 2025

GNT: మృతదేహాల తరలింపులోనూ వసూళ్ల దందా.!

image

ఎంతో ఘన చరిత్ర ఉన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మహాప్రస్థానం వాహనాల డ్రైవర్లు వసూళ్ల దందాకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. మృతదేహాన్ని ఉచితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన మహాప్రస్థానం వాహన డ్రైవర్లు దూరాన్ని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రాణం కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబాలను కూడా బ్లాక్‌ మెయిల్ చేస్తున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోతున్నారు.