News March 24, 2025
అమరావతి: న్యాయవాదులకు గుడ్ న్యూస్

న్యాయవాదుల డెత్ బెనిఫిట్‌ను ఆరు లక్షలకు పెంచుతూ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆదివారం హైకోర్టులో జరిగిన కౌన్సిల్ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ మొత్తం ఐదు లక్షల రూపాయలుగా ఉంది. అనారోగ్యానికి గురైన వారికి ఒకటిన్నర లక్ష ఇవ్వనున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ తీర్మానాలు అమల్లోకి వస్తాయి. ప్రమాదవశాత్తు మరణించిన వారికి పై మొత్తంతో సంబంధం లేకుండా మరో ఐదు లక్షలు ఇస్తారు.
Similar News
News March 31, 2025
గుంటూరు నగరంలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

గుంటూరు నగరంలో సోమవారం ఎస్పీ సతీశ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు నిర్వహిస్తున్న తీరును తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బందిలో వివిధ నిర్వాహణలో జవాబు దారీతనాన్ని పెంపొందించడానికి ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
News March 31, 2025
ఫిరంగిపురం: పిల్లలకు నరకం చూపించిన సవతి తల్లి

ఫిరంగిపురంలో పిల్లల్ని సవతి తల్లి లక్ష్మి కొట్టి చంపిన ఘటన తెలిసిందే. కాగా కొన్ని నెలల క్రితం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కార్తీక్, ఆకాశ్‌లను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈనెల 29న ఆమె ఆకాశ్‌ను వేడి పెనంపై కూర్చోబెట్టింది. కార్తీక్‌ను తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న మేనత్త వారిద్దరినీ తీసుకెళ్లింది. అప్పటికే కార్తీక్ చనిపోయాడు.
News March 31, 2025
గుంటూరు: నేడు PGRS కార్యక్రమం రద్దు

రంజాన్ పర్వదిన సందర్భంగా నేడు PGRS కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ కార్యాలయంలో అర్జీలు ఇవ్వదలచుకున్న ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.