News September 19, 2024

అమరావతి: పాఠశాలలకు దసరా సెలవులు ఎప్పటినుంచి అంటే?

image

రాష్ట్రంలో పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15న తిరిగి స్కూళ్లు ప్రారంభమవుతాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Similar News

News December 3, 2025

అమరావతి: సచివాలయంలో బారికేడ్ల తొలగింపు

image

అమరావతి సచివాలయంలో ఇనుప బారికేడ్లను తొలగించారు. బారికేడ్ల వల్ల ప్రజలు, సందర్శకులు ఇబ్బంది పడుతున్నారని గమనించిన సీఎం చంద్రబాబు.. వెంటనే వాటిని తొలగించాలని పోలీసులను ఆదేశించారు. బ్లాకుల ముందు బారికేడ్లకు బదులుగా పూల కుండీలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన బారికేడ్లను తొలగించి, ఆ స్థానంలో అందమైన క్రోటాన్, పూల మొక్కలను ఏర్పాటు చేశారు.

News December 3, 2025

నడింపాలెంలో రూ. 93.82 కోట్లతో CRIYN, 100 పడకల ఆసుపత్రి

image

ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 100 పడకల ఆసుపత్రి, సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి (CRIYN) నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. రాజ్యసభ వేదికగా ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నకు కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.93.82 కోట్ల అంచనాతో ఈ నిర్మాణం ఉండబోతోందని చెప్పారు.

News December 3, 2025

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. పి.జి.ఆర్.ఎస్‌లో అందిన ఆర్జీలపై నియోజకవర్గ స్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. ఎస్.ఎల్.ఏ కాల పరిధి దాటకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.