News September 23, 2024
అమరావతి: మైనార్టీ సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష
మైనారిటీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సోమవారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ పథకాల రీస్ట్రక్చర్ చేయాలని ఆదేశించారు. కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తి చేయాలన్నారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇమామ్ లకు, మౌజన్ లకు రూ.10, రూ. 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలాన్నారు. భూముల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News October 13, 2024
ఉమ్మడి గుంటూరు జిల్లాలలో బైక్ అంబులెన్స్ సేవలు ప్రారంభం: ఎస్పీ
దీర్ఘాయుష్మాన్ బైక్ అంబులెన్స్‌ను ఎస్పీ కంచి శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. క్షతగాత్రులు బైక్ అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే డాక్టర్ లేదా నర్స్ ప్రమాద స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స చేసి అనంతరం ఆసుపత్రికి పంపిస్తారన్నారు. బైక్ అంబులెన్స్ సేవలు నేటి నుంచి ఉమ్మడి జిల్లాలలో 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. బైక్ అంబులెన్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ 8340000108, 8186000108నంబర్లు ఇవే.
News October 13, 2024
గత ప్రభుత్వం నాపై అక్రమ కేసులు పెట్టింది: ధూళిపాళ్ల
గత ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబటి మురళీకృష్ణ తనపై బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ల నిర్మాణంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఆ అక్రమాలను నిరూపించటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
News October 12, 2024
గుంటూరు: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి.?
దసరా పండుగ అనగానే అందరికీ పల్లెటూరు గుర్తుకు వచ్చేస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, స్నేహితులు కలిసి ఊరంతా సంతోషంగా తిరుగుతూ ఉంటారు. ఊరిలో అందరినీ పలకరిస్తూ.. ఉంటే ఆ ఆనందం మాట్లల్లో చెప్పలేని సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి ఊరితో ఒక్కో విధంగా పండుగను జరుపుకుంటారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.