News October 10, 2024
అమరావతి: రతన్ టాటా మృతిపై సీఎం, మంత్రి మండలి సంతాపం

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతిపై సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర మంత్రి మండలి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు గురువారం రతన్ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టాటా మృతి ఎంతో బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతరం ఆయన మృతిపై సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Similar News
News November 30, 2025
GNT: దిత్వా తుఫాన్.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు.!

దిత్వా తుఫాన్ నేపథ్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 0863 2234014 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
News November 29, 2025
GNT: జెండర్ ఆధారిత హింసపై వైద్యాధికారులకు శిక్షణ

గుంటూరు (D) వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో జెండర్ బేస్డ్ వైలెన్స్, మెడికో-లీగల్ కేర్‌పై వైద్యాధికారులకు శనివారం శిక్షణ నిర్వహించారు. APP మురళీకృష్ణ మహిళలు, బాలికలపై హింస నివారణలో వైద్యుల పాత్ర కీలకమని చెప్పారు. మెడికో-లీగల్ కేసుల్లో కన్సెంట్, ఉచిత చికిత్స, పోలీసులకు సమాచారం తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. జాతీయ హైవే ప్రమాద బాధితులకు రూ.లక్షన్నర వరకు క్లెయిమ్ అవకాశం ఉందని DMHO విజయలక్ష్మీ తెలిపారు.
News November 29, 2025
GNT: ‘రిజిస్ట్రేషన్ సమయంలో జాగ్రత్తలు పాటించాలి’

భూమి/ఇళ్ల రిజిస్ట్రేషన్ సమయంలో కచ్చితమైన డాక్యుమెంట్ విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను (సేల్ 7.5%, గిఫ్ట్ 3.5%) సబ్ రిజిస్ట్రార్‌ను తెలుసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ శైలజ సూచించారు. ప్రాంతాల వారీగా భవన నిర్మాణ స్క్వేర్ ఫీట్ రేట్లు మారే అవకాశం ఉందని, వాటిని అంచనా వేయాలన్నారు. డాక్యుమెంటేషన్ ఛార్జీలు ₹3,000-₹5,000 వరకు ఉండొచ్చని తెలిపారు. సమస్యలుంటే వెంటనే సబ్ రిజిస్ట్రార్‌ను సంప్రదించాలని సూచించారు.


