News March 30, 2024

అమరావతి వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

అమరావతిలోని పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న పంప్ హౌస్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం శనివారం లభ్యమైందని అమరావతి పోలీసులు తెలిపారు. ఓ మగ శవం (35) నీటిపై తేలాడుతూ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ బ్రహ్మం అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు పసుపు రంగు చారలు ఉన్న టీ షర్ట్ ధరించినట్లు సీఐ చెప్పారు. కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News December 13, 2025

మంగళగిరి: సీఎం సభా ఏర్పాట్లు పరిశీలించిన హోం మంత్రి

image

మంగళగిరి APSP 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 16న కానిస్టేబుల్ ఉద్యోగాలకు నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. శనివారం సభా ఏర్పాట్లను హోంమంత్రి అనిత.. డీఐజీ ఏసుబాబు, ఎస్పీ వకుల్ జిందాల్, బెటాలియన్ కమాండెంట్ నగేశ్ బాబులతో కలిసి పరిశీలించారు. అభ్యర్థులు వారి కుటుంబాలతో కలిసి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె చెప్పారు.

News December 13, 2025

మంగళగిరి: ఆ అధికారి ఆఫీసుకు వచ్చి ఏడాది దాటింది!

image

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (మంగళగిరి) కార్యాలయం సబార్డినేటర్ మహ్మద్ ఫజల్-ఉర్-రహమాన్ విధులకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో సహాయ సంచాలకులు సీరియస్ అయ్యారు. గతేడాది జూన్ నుంచి నేటి వరకు ఎటువంటి అనుమతి లేకున్నప్పటికీ విధులకు హాజరు కావడం లేదని చెప్పారు. ఇప్పటి వరకు 3 సార్లు నోటీసులు జారీచేసినప్పటికీ స్పందించలేదన్నారు. 15 రోజుల లోపులిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని, లేకుంటే సర్వీస్ నుంచి తొలగిస్తామన్నారు.

News December 13, 2025

నేడు తుళ్లూరులో ఎంపీ పెమ్మసాని పర్యటన

image

తుళ్లూరు మండలంలో శనివారం కేంద్ర సహాయ మంత్రి, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలో అమరావతి అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తుళ్లూరులోని మేరీమాత స్కూల్లో “నయీ చేతన” కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.