News March 30, 2024
అమరావతి వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం
అమరావతిలోని పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న పంప్ హౌస్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం శనివారం లభ్యమైందని అమరావతి పోలీసులు తెలిపారు. ఓ మగ శవం (35) నీటిపై తేలాడుతూ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ బ్రహ్మం అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు పసుపు రంగు చారలు ఉన్న టీ షర్ట్ ధరించినట్లు సీఐ చెప్పారు. కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News January 18, 2025
మంగళగిరి: పవన్ క్యాంప్ ఆఫీసుపై డ్రోన్ కలకలం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసు అయిన మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం సమయంలో కార్యాలయంపై ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది. దాదాపు 20నిమిషాలు పాటు డ్రోన్ ఎగిరినట్లు కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. దీంతో ఉలిక్కిపడిన సిబ్బంది వెంటనే డీజీపీ, కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు.
News January 18, 2025
NTRకు భారతరత్న ఇచ్చేలా కేంద్రంతో చర్చలు: లోకేశ్
రాజకీయాల్లోకి వచ్చిన 9నెలల్లో ప్రభంజనం సృష్టించి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో తల్లి భువనేశ్వరితో కలిసి లోకేశ్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు తలెత్తుకు తిరిగేలా చేశారని కొనియాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.
News January 18, 2025
గుంటూరులో ఇద్దరు డీఎస్పీలు బదిలీ
గుంటూరు వెస్ట్, సౌత్ డీఎస్పీలు జయరామ్ ప్రసాద్, మల్లికార్జునరావును ప్రభుత్వం బదిలీ చేసింది. గతేడాది బోరుగడ్డ అనిల్ కుమార్ అరండల్‌పేట స్టేషన్‌లో ఉన్నప్పుడు దిండు, దుప్పట్లు ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులను కలిసి రాచమర్యాదలు చేశారనే దానిపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇదిలా ఉంటే బదిలీతో ఖాళీ అయిన స్థానాలను భానోదయ, అరవింద్‌తో ప్రభుత్వం భర్తీ చేసింది.