News October 4, 2024

అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

image

ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం షెడ్యూల్‌ను సీఎం కార్యాలయం విడుదల చేసింది. సీఎం చంద్రబాబు నేడు ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఎంఎస్ఎంఈ నూతన పాలసీపై సమీక్ష చేస్తారు. అనంతరం ఆదాయ ఆర్జన శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష చేస్తారని సీఎం కార్యాలయం తెలియజేసింది.

Similar News

News October 23, 2025

గుంటూరులో ట్రాఫిక్ నిర్వహణపై ఎస్పీ ఆకస్మిక పర్యటన

image

గుంటూరు నగరంలో ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ పనితీరును ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. పట్టాభిపురం, బ్రాడీపేట, కొత్తపేట, బస్టాండ్ సెంటర్, తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News October 23, 2025

GNT: స్కూల్స్‌కు సెలవుపై పేరెంట్స్ విమర్శలు

image

భారీ వర్షాల కారణంగా గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంపై తల్లిదండ్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉదయం 9 గంటల తర్వాత సెలవు ప్రకటించడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అప్పటికే పిల్లలు వర్షంలో తడుస్తూ పాఠశాలలకు వెళ్లిపోయారని, ఉదయం నుంచే వర్షం పడుతున్నందున ముందుగానే స్పందించి ఉండాల్సిందన్నారు. రేపటి సెలవు సమాచారమైనా ముందుగానే స్పష్టంగా ఇవ్వాలన్నారు.

News October 23, 2025

GNT: భారీ వర్షాలకు అప్రమత్తమైన అధికార యంత్రాంగం

image

తీవ్ర అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గుంటూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం ఉదయం నుంచి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల ప్రజలను అప్రమత్తంగా చేయాలని, చెట్లు, భారీ హోర్డింగ్లు, శిథిల భవనాల వద్ద ఉంచవద్దని సూచించారు. అత్యవసరమైతే గుంటూరు కలెక్టరేట్ నెంబర్ 08632234990కు సమాచారం ఇవ్వాలని సూచించారు.