News October 14, 2024
అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం షెడ్యూల్ను సీఎం కార్యాలయ అధికారులు విడుదల చేశారు. చంద్రబాబు 12 గంటలకు సచివాలయానికి వస్తారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో తీసుకువస్తున్న పలు నూతన పాలసీలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇండస్ట్రియల్, ఎంఎస్ఎంఈ, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్ డ్రాఫ్ట్ పాలసీలపై విడి విడిగా సీఎం అధికారులతో చర్చిస్తారని కార్యాలయం తెలిపింది.
Similar News
News November 18, 2025
ANU: థర్డ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం బిఈడి థర్డ్ సెమిస్టర్, పీజీ సైన్స్, ఆర్ట్స్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈడి, ఎల్.ఎల్.బి పరీక్షలు ప్రారంభమయ్యాయి. థర్డ్ సెమిస్టర్ 22 పరీక్షా కేంద్రాల్లోను, ఎల్.ఎల్.బి గుంటూరులో మూడు పరీక్ష కేంద్రాలు, ప్రకాశం జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్నాయి. వర్సిటీ పరీక్షల సమన్వయకర్త ఆచార్య ఎం.సుబ్బారావు పరీక్షలు తీరును పరిశీలించారు.
News November 18, 2025
మంగళగిరి: భార్యను హత్య చేసిన భర్త

మంగళగిరి పరిధి యర్రబాలెంలో వివాహిత హత్యకు గురైంది. CI బ్రహ్మం, SI వెంకట్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. వారి వివరాల మేరకు.. మచిలీపట్నంకు చెందిన కిలిమి లక్ష్మీ (29) 5 ఏళ్ళ క్రితం శంకర్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. కలహాలతో విడిపోయి, చినకాకానికి చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తూ యర్రబాలెంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె భర్త శంకర్ రెడ్డి గొంతునులిమి హత్యచేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
News November 18, 2025
ANU: LLB రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన LLB రీవాల్యుయేషన్ ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. LLB VI, X సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధించిన అధికారులను సంప్రదించాలన్నారు.


