News March 16, 2025
అమలాపురంలో రేపటి నుంచి ఇంటర్ వాల్యుయేషన్

కోనసీమ జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షకు సంబంధించి సోమవారం నుంచి వాల్యుయేషన్ ప్రక్రియ చేపడుతున్నట్లు ఇంటర్మీడియట్ జిల్లా విద్యా అధికారి సోమశేఖరరావు తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, పౌరశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించిన వాల్యుయేషన్ అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరుగుతుందన్నారు. ఇప్పటికే ఏడో తేదీ నుంచి సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుందన్నారు.
Similar News
News October 26, 2025
గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు

WGL నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. నగర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మేయర్ సుధారాణి తెలిపారు. నిధుల మంజూరుకు సహకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, MLAలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, శ్రీహరిలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
News October 26, 2025
నేడు కురుమూర్తి స్వామి అలంకార ఉత్సవం

ఉమ్మడి జిల్లా ప్రజల కొంగుబంగారం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఆవాహిత దేవతా పూజలు జరిగాయి. ఆత్మకూరులోని ఎస్బీఐ బ్యాంకులో ఉన్న స్వామివారి స్వర్ణాభరణాల ఊరేగింపు అనంతరం సాయంత్రం 5:30 గంటలకు అలంకార ఉత్సవం ఉంటుంది. రాత్రి 9 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారి అశ్వవాహన సేవ ఉంటుందని అర్చకులు తెలిపారు.
News October 26, 2025
బ్రూక్ విధ్వంసం..

న్యూజిలాండ్తో తొలి వన్డేలో ఇంగ్లండ్ కెప్టెన్ బ్రూక్ వన్ మ్యాన్ షో చూపించారు. ఇంగ్లండ్ 10 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్కు వచ్చిన బ్రూక్ అద్భుతమైన షాట్లతో 82 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నారు. 11 సిక్సర్లు, 9 ఫోర్లతో విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్ 35.2 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ENG బ్యాటర్లలో బ్రూక్ (135), ఓవర్టన్ (46) మాత్రమే రెండంకెల స్కోర్ చేయడం గమనార్హం.


