News September 14, 2024
అమలాపురం: అత్యాచారయత్నం కేసులో ఏడేళ్లు జైలు శిక్ష

అమలాపురం మండలం సాకుర్రు గ్రామానికి చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి వీర వెంకట సత్యనారాయణకు ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారని రూరల్ సీఐ వీరబాబు శుక్రవారం తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ఈ సంఘటన జరిగిందన్నారు. అత్యాచారయత్నానికి ప్రయత్నించి అడ్డువచ్చిన అమ్మమ్మపై దాడి చేశారన్నారు.
Similar News
News February 13, 2026
తూ.గో జిల్లాలో ఈనెల 17న డీ-వార్మింగ్ డే- డీఎంహెచ్‌ఓ

తూర్పుగోదావరి జిల్లాలోని అంగన్‌వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో ఈ నెల 17న జాతీయ డీ-వార్మింగ్ డే నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆ రోజు మాత్రలు వేసుకోలేని వారి కోసం 24న ‘మాప్-అప్ డే’ ఏర్పాటు చేశామన్నారు. వయసును బట్టి ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని, పిల్లలకు ఆహారం తిన్న తర్వాతే వీటిని వేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News February 13, 2026
రాజమండ్రి: అరినా-3 పూర్తి చేయాలి.. కేంద్రమంత్రికి పురందేశ్వరి వినతి

రాజమండ్రి వి.ఎల్ పురంలోని అరినా-3 క్రీడా సముదాయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి కోరారు. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. నగర యువతకు ఆధునిక క్రీడా వసతులు కల్పించడంతో పాటు, రాబోయే గోదావరి పుష్కరాల సమయంలో ఈ ప్రాజెక్ట్ బహుళ ప్రయోజనకారిగా మారుతుందని ఆమె పేర్కొన్నారు.
News February 13, 2026
సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే బత్తుల భేటీ

సీఎం చంద్రబాబుతో రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల అనంతరం భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సీఎంకు అందించారు. 2027 పుష్కరాలకు రాజానగరం నియోజకవర్గానికి ప్రాధాన్యత నిచ్చి తగిన నిధులు కేటాయించాలని, సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. వాటిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.


