News January 30, 2025

అమలాపురం: అరటి రైతులకు భారీ నష్టం..!

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో అరటి గెలలు తోటల్లోనే మగ్గిపోతున్నాయి. మార్కెట్‌కు పంట తీసుకెళ్తే.. గెలను రూ.30 నుంచి రూ.40కి మించి కొనడం లేదు. కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్లో డజన్ అరటి పండ్లు రూ.50 నుంచి రూ.60కి విక్రయిస్తున్నారు. కోనసీమ రైతులకు గెలకు సైతం ఆ ధర దక్కకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.

Similar News

News February 16, 2025

కోనసీమ: గుడ్డుకీ గడ్డు కాలం..భారీగా పడిపోయిన ధర

image

బర్డ్‌ ప్లూ దెబ్బకు గుడ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. రూ.4.90 గుడ్డు ధర రూ.4.55కు పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గుడ్ల ఉత్పత్తి 1.30 కోట్ల మేర ఉండగా స్థానికంగా వినియోగం 30 శాతం ఉంటుంది. మిగిలిన 70 శాతం గుడ్లు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, అస్సాం, మేఘాలయ తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతాయి. ట్రెడర్లు బర్డ్ ప్లూ పేరుతో కొంత మేర ధర తగ్గించినట్లు చెబుతున్నారు.

News February 16, 2025

తూ.గో: గుడ్డుకీ గడ్డు కాలం..భారీగా పడిపోయిన ధర

image

బర్డ్‌ ప్లూ దెబ్బకు గుడ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. రూ.4.90 గుడ్డు ధర రూ.4.55కు పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గుడ్ల ఉత్పత్తి 1.30 కోట్ల మేర ఉండగా స్థానికంగా వినియోగం 30 శాతం ఉంటుంది. మిగిలిన 70 శాతం గుడ్లు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, అస్సాం, మేఘాలయ తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతాయి.ట్రేడర్లు బర్డ్ ఫ్లూ పేరుతో కొంత మేర ధర తగ్గించినట్లు చెబుతున్నారు.

News February 16, 2025

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

image

గంగవరం మండలంలో నాలుగు రోడ్ల వద్ద రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు బైకులు అధిక వేగంతో వస్తూ ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా 108 వాహనంలో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!