News March 18, 2024
అమలాపురం అల్లర్లు.. జీవోపై హైకోర్టు స్టే

అమలాపురం అల్లర్లపై కేసులు తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు ఈరోజు స్టే ఇచ్చింది. దళిత నాయకులు జంగా బాబురావుతో పాటు మరో ఆరుగురు నేతలు వేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 2022లో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటు విషయమై గొడవలు జరిగాయి. అప్పట్లో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు కొంతమంది నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 300 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 5, 2025
రాజమండ్రి: నేడు మెగా ‘పేరెంట్-టీచర్’ మీటింగ్

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ‘మెగా పేరెంట్-టీచర్’ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు డీఈవో కె.వాసుదేవరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 1,570 పాఠశాలల్లో జరిగే ఈ బృహత్తర కార్యక్రమంలో 2,37,754 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భాగస్వాములవుతారని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రగతిపై చర్చించే ఈ సమావేశాలను విజయవంతం చేయాలని డీఈవో కోరారు.