News March 22, 2024
అమలాపురం ఎంపీ అభ్యర్థిగా హరీశ్.. నేపథ్యం ఇదే
టీడీపీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీశ్ మాధుర్ పోటీ చేయనున్నట్లు అధినేత చంద్రబాబు ప్రకటించారు. హరీశ్ 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి మళ్లీ ఇదే పార్లమెంట్ స్థానం నుంచి ఆయనకు అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈయన జీఎంసీ బాలయోగి కుమారుడు.
Similar News
News September 14, 2024
అమలాపురం: అత్యాచారయత్నం కేసులో ఏడేళ్లు జైలు శిక్ష
అమలాపురం మండలం సాకుర్రు గ్రామానికి చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి వీర వెంకట సత్యనారాయణకు ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారని రూరల్ సీఐ వీరబాబు శుక్రవారం తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ఈ సంఘటన జరిగిందన్నారు. అత్యాచారయత్నానికి ప్రయత్నించి అడ్డువచ్చిన అమ్మమ్మపై దాడి చేశారన్నారు.
News September 13, 2024
రంపచోడవరం: అనారోగ్యంతో లెక్చరర్ మృతి
రంపచోడవరం ఏపీ గిరిజన బాలికల గురుకుల కళాశాల ఇంగ్లీషు లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న కె.ఉషాకిరణ్(42) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. రాజమండ్రిలో నివాసం ఉంటూ కొంత కాలంగా ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారని స్నేహితులు తెలిపారు. ఆమెకు భర్త, ఇరువురు పిల్లలు ఉన్నారు. గతంలో రాజవొమ్మంగి, బుట్టాయిగూడెం గురుకుల పాఠశాలల్లో పని చేశారని ఆమె మరణం జీర్ణించకోలేక పోతున్నామని తోటి ఉద్యోగులు తెలిపారు.
News September 13, 2024
పిఠాపురం: జగన్‌ను కలిసేందుకు కాన్వాయ్ ఎక్కిన అభిమాని
పిఠాపురం నియోజకవర్గంలో మాజీ సీఎం YS జగన్ పర్యటన కొనసాగుతోంది. మాధవపురం గ్రామంలో బాధితులను కలిసేందుకు కాన్వాయ్ దిగారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి జగన్‌ను కలిసేందుకు కాన్వాయ్ ఎక్కాడు. అప్రమత్తమైన సిబ్బంది అతణ్ని అక్కడి నుంచి పంపించేశారు.