News February 17, 2025
అమలాపురం: ఎమ్మెల్సీ ఎన్నికకు ముమ్మర ఏర్పాట్లు

ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలైంది. బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణ తదితర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 27న ఉ.8 గంటల నుంచి సా.4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 6 జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 2 వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
Similar News
News March 22, 2025
HYD: వరదల్లో కొట్టుకొచ్చిన శిశువు మృతదేహం (PHOTO)

హైదరాబాద్‌లో శిశువు మృతదేహం కలకలం రేపింది. అర్ధరాత్రి హైటెక్ సిటీలో భారీ వర్షానికి వరదలు వచ్చాయి. మెడికవర్ హాస్పిటల్ ముందున్న మ్యాన్ హోల్ వద్ద ఓ పసికందు మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన వాహనదారులు వెంటనే లోకల్ PSకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 22, 2025
యువతిపై దాడి కేసులో ఇద్దరికి రిమాండ్

HNRలో యువతిపై దాడి చేసి శారీరకంగా కలవాలని బెదిరించి గాయపరిచిన ఘటనలో గురువారం ఇద్దరు యువకులతో పాటు, ఓ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం ఇద్దరిని రిమాండ్‌కు తరలించగా, మరొకరు పరారీలో ఉన్నట్లు హుజుర్‌నగర్ సీఐ చరమంద రాజు, ఎస్ఐ ముత్తయ్య తెలిపారు.
News March 22, 2025
విశేష దర్శనంలో భద్రకాళీ అమ్మవారు

ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శనివారం అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషంగా అలంకరణ చేసి వచ్చిన భక్తులకు విశేష పూజలు, హారతి ఇచ్చి భక్తులకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదములు అందచేశారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, సిబ్బంది, భక్తులు ఉన్నారు.