News February 22, 2025
అమలాపురం: క్రీడాఅవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి

2025–26 సంవత్సరానికి క్రీడలు, ఆట విభాగాలలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు స్పోర్ట్స్ అవార్డు కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లు కోనసీమ జిల్లా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కోచ్ సురేష్‌కుమార్ తెలిపారు. కోనసీమ జిల్లాలోని అర్హతగల క్రీడాకారులు, ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్ బాలురు, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ క్రీడాకారులు, కోచ్ లు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Similar News
News February 23, 2026
తెలంగాణ ఉద్యమకారులకు గుడ్ న్యూస్

TG: తెలంగాణ సాధనలో పోరాడిన ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. తమకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఉద్యమకారులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. పిటిషనర్ల తరఫున లాయర్ కరుణాకర్ రెడ్డి వాదించారు. అభయహస్తం స్కీం కింద అప్లై చేసిన వీరికి 8వారాల్లో ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలని న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి తీర్పు ఇచ్చారు.
News February 23, 2026
అమరావతిలో రూ.40,887 కోట్లతో ట్రంక్ రోడ్లు

AP: అమరావతిలో రూ.40,887 కోట్లతో ప్రభుత్వం ట్రంక్ రోడ్ల నిర్మాణం చేపడుతోంది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు సమీకరిస్తోంది. ఇందులో భాగంగా IRRను 96 KM మేర 8+4గా నిర్మించనున్నారు. 26 గ్రామాల్లో భూ సమీకరణ చేయనున్నారు. 2027 నాటికి ఇది పూర్తవుతుంది. కాగా రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే రూ.18,779 కోట్లతో టెండర్లు కూడా పిలిచామని మంత్రి నారాయణ ఇటీవల అసెంబ్లీలో తెలిపారు.
News February 23, 2026
రేపు కుమ్మెరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం కుమ్మెర గ్రామానికి రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రానున్నారు. ఇటీవల కులవివక్షకు గురైన బాధితులను ఆయన పరామర్శిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు.


