News January 26, 2025
అమలాపురం: జాతీయ పతాకాన్ని ఎగరవేసిన బ్యాడ్మింటన్ సాత్విక్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమలాపురం ఆఫీసర్స్ క్లబ్‌లో అంతర్జాతీయ క్రీడాకారుడు సాత్విక్ సాయి రాజ్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఇక్కడే షటిల్ బ్యాడ్మింటన్ నేర్చుకుని అంతర్జాతీయ స్థాయికి వెళ్లారన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కోనసీమ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు మెట్ల రమణబాబు, మెట్ల సూర్య నారాయణ, అల్లాడ శరత్ బాబు పాల్గొన్నారు.
Similar News
News September 16, 2025
ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించాలి: జేసీ

ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుపై ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 1,56,505 ఎకరాల్లో వరి సాగైందని, 4.34 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కొనుగోలు ప్రక్రియపై ఆమె అధికారులకు సూచనలు ఇచ్చారు.
News September 16, 2025
ఒక్కసారిగా ‘టమాటా’ విలన్ అయ్యాడు!

వారం క్రితం కిలో రూ.40 వరకు పలికిన టమాటా ధరలు అమాంతం పడిపోయాయి. పత్తికొండ మార్కెట్‌లో కిలో రూ.5-8, 20 కిలోల గంప కేవలం రూ.150 మాత్రమే పలుకుతుండటంతో రవాణా ఖర్చులకే ఆ డబ్బు సరిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ డివిజన్ పరిధిలో 5,500 హెక్టార్లలో పంట సాగు కాగా దిగుబడులు భారీగా వస్తున్నాయి. ధరలు మాత్రం లేకపోవడంతో కొందరు మార్కెట్‌లో, మరికొందరు రోడ్డు గట్టున టమాటాలను వదిలి వెళ్తున్నారు.
News September 16, 2025
మైదుకూరు: ఫైనాన్స్ సిబ్బంది వేధింపులు.. యువకుడు ఆత్మహత్య

మైదుకూరు పట్టణం సాయినాథపురం గ్రామానికి చెందిన రమేశ్ అనే యువకుడు ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందాడు. రమేశ్ తన ఇంటి అవసరాల కోసం ఫైనాన్స్ కంపెనీ వద్ద రుణం తీసుకున్నాడు. రుణాలు చెల్లించకపోవడంతో కంపెనీ సిబ్బంది ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడిని తట్టుకోలేక ఈ అఘాయిత్యనికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.