News March 23, 2025

అమలాపురం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

image

ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమలాపురం డిపో నుంచి ఏప్రిల్ 5న ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కళ్యాణం పూర్తయిన తర్వాత భద్రాచలం నుంచి అమలాపురం రావడానికి మధ్యాహ్నం1:30 నుంచి రాత్రి 7 గంటల వరకు బస్సులు నడుపుతామన్నారు.

Similar News

News March 31, 2025

హారతి ఇస్తుండగా మంటలు అంటుకొని మాజీ మంత్రికి తీవ్రగాయాలు

image

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గిరిజా వ్యాస్(78) తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లో హారతి ఇస్తుండగా ఆమె చీరకు నిప్పంటుకుంది. దీంతో గాయాలు కాగా కుటుంబ సభ్యులు ఉదయ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అహ్మదాబాద్‌కు తీసుకెళ్లారు. 1985 నుంచి 1990 వరకు ఆమె రాజస్థాన్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా సేవలందించారు.

News March 31, 2025

కేజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ ఓ.పి. సేవలు

image

విశాఖ కేజీహెచ్‌లో ఏప్రిల్ 1 నుంచి అన్ని పని రోజులలో సూపర్ స్పెషాలిటీ ఓ.పి. సేవలు ఉంటాయని కేజీహెచ్ సూపరింటెండ్ శివానంద్ సోమవారం తెలిపారు. గతంలో ఒక్కో రోజు ఒక్కొక్క సూపర్ స్పెషాలిటీ వైద్యానికి ఓ.పి.విభాగాలు పని చేసేవన్నారు. కానీ రేపటి నుంచి అన్ని పనిదినాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సా.4 వరకు ఓ.పి. చూస్తారని వెల్లడించారు. ప్రజలు గమనించాలని కోరారు.

News March 31, 2025

ప్రకాశం: ఇవాళ అర్ధరాత్రి వరకే ఛాన్స్

image

ఉగాది సందర్భంగా దోర్నాల-శ్రీశైలం మార్గంలో ఈనెల 27 నుంచి 24 గంటలూ వాహన రాకపోకలకు అటవీశాఖ అధికారులు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ(సోమవారం)అర్ధరాత్రి 12 గంటలకు మాత్రమే వాహన రాకపోకలకు అనుమతులు ఉంటాయని దోర్నాల ఫారెస్ట్ రేంజర్ జీవన్ కుమార్ తెలిపారు. 12 గంటల తర్వాత వాహనాలను నిలిపివేస్తామని చెప్పారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

error: Content is protected !!