News March 23, 2025

అమలాపురం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

image

ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమలాపురం డిపో నుంచి ఏప్రిల్ 5న ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కళ్యాణం పూర్తయిన తర్వాత భద్రాచలం నుంచి అమలాపురం రావడానికి మధ్యాహ్నం1:30 నుంచి రాత్రి 7 గంటల వరకు బస్సులు నడుపుతామన్నారు.

Similar News

News April 18, 2025

సాక్స్‌లు వేసుకుని పడుకుంటే సుఖమైన నిద్ర!

image

రాత్రి నిద్ర సరిగా పట్టడంలేదని కొందరు, ఎక్కువ సమయం పడుకున్నా సంతృప్తి లేదని మరికొందరు బాధపడుతుంటారు. అయితే సాక్సులు వేసుకుని పడుకోవడం సుఖమైన నిద్రకు ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పాదాలు వేడెక్కి చర్మం కింది రక్త నాళాలు మిగతా బాడీని కూల్ చేస్తాయంటున్నారు. దాంతో శరీరం నిద్రకు ఉపక్రమిస్తుందంటున్నారు. అయితే ఇన్సోమేనియా వంటి నిద్ర సంబంధిత వ్యాధులున్నవారు ట్రై చేయొద్దని సూచిస్తున్నారు.

News April 18, 2025

HNK: జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్..

image

✓ నర్సంపేట పోలీసులకు చిక్కిన పేకాట రాయుళ్ళు
✓ WGL: మూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం!
✓ MGMలో దొంగలు ఉన్నారు.. జాగ్రత్త!
✓ కమలాపూర్: పోక్సో కేసులో నిందితుడు అరెస్ట్
✓ వేలేరు పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
✓ NSPT: వ్యభిచార గృహంపై దాడులు
✓ ఆత్మకూరు: సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలపై అవగాహన
✓ శాయంపేట పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు..

News April 18, 2025

డ్రగ్స్ స్కామ్‌లో వైద్యుడికి 130ఏళ్ల జైలు శిక్ష

image

$2.3 మిలియన్ల డ్రగ్స్ స్కామ్‌లో భారత సంతతి వైద్యుడికి అమెరికాలో 130 ఏళ్ల జైలు శిక్ష పడింది. పెన్సుల్వేనియాకు చెందిన ఆనంద్(48) మెడికేర్‌కు తప్పుడు పత్రాలు సమర్పించారని, పేషెంట్లకు నిషేధిత ట్యాబ్లెట్స్ ఇచ్చారన్న అభియోగాలపై విచారణ జరిపి యూఎస్ ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. 20 వేలకు పైగా ఆక్సికోడోన్ వంటి అడిక్టివ్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేసినట్లు రుజువైందని పేర్కొంది.

error: Content is protected !!