News March 8, 2025
అమలాపురం: నేడు జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు శనివారం కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7:30 గంటలకు విజయవాడ నుంచి రోడ్డు మార్గం ద్వారా అమలాపురం బయలుదేరతారు. 10:30 గంటలకు ముక్తేశ్వరం రోడ్డులోని సత్యనారాయణ గార్డెన్స్లో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 10:30 నుంచి 1:30 గంటల వరకు మహిళా దినోత్సవంలో పాల్గొంటారు. భోజన విరామం అనంతరం 2:30 గంటలకు బయలుదేరి విజయవాడ వెళ్తారు.
Similar News
News November 3, 2025
కార్తీక పౌర్ణమి.. 10 లక్షల దీపాలతో ఏర్పాట్లు

UPలోని కాశీ మరో అద్భుత ఘట్టానికి వేదిక కానుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 5న అక్కడ దేవ్ దీపావళిని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గంగా నది ఘాట్లతోపాటు నదీ తీరంలోని 20 ప్రాంతాల్లో దాదాపు 10 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించనుంది. అలాగే కాశీ గొప్పతనాన్ని చాటేలా 500 డ్రోన్లతో ప్రదర్శన, లేజర్ షో, 3D ప్రజెంటేషన్ ఉండనుంది.
News November 3, 2025
SLBC టన్నెల్.. రేపటి నుంచి సర్వే

TG: SLBC (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రిపేర్ అవుతోంది. రేపు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వేను ప్రారంభించనున్నారు. సొరంగాల నిపుణుల సహాయంతో ఈ సర్వే చేపట్టనున్నారు. గతేడాది టన్నెల్ కూలి 8 మంది కార్మికులు మరణించడంతో అలాంటి లూస్ సాయిల్ ఎక్కడ ఉందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సొరంగం మొత్తం పొడవు 43.9 కి.మీ కాగా ఇంకా 9.5 కి.మీ తవ్వాల్సి ఉంది.
News November 3, 2025
ములుగు: నెదర్లాండ్స్ పర్యటనకు మంత్రి సీతక్క..!

తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క విదేశీ పర్యటనకు బయలుదేరారు. స్త్రీ, శిశు సంక్షేమంపై అమలవుతున్న పథకాలు, ఇతర కార్యక్రమాలను పర్యవేక్షించే నిమిత్తం ఆమె నెదర్లాండ్స్కు వెళ్లారు. మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో, పార్టీ వర్గాలు ఆమెకు ఆల్ ది బెస్ట్ తెలిపి, క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.


