News March 29, 2025

అమలాపురం: ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచనలు

image

ఈ ఏడాది రికార్డు స్థాయిలో వడగాల్పులు ఉంటాయన్న వాతవరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ప్రజలకు సూచించారు. వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై శుక్రవారం సమీక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. జనసంచారం, భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News April 3, 2025

2026 T20WC వరకు టైట్ షెడ్యూల్

image

ఐపీఎల్ తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీ కానున్నారు. 2026 T20 WC వరకు టైట్ షెడ్యూల్ ఖరారైంది. జూన్-జులైలో ENGతో 5 టెస్టులు, SEPలో ఆసియా కప్, OCTలో వెస్టిండీస్‌తో 2 టెస్టులు, OCT-NOVలో AUSతో 3 ODI & 5 T20I, NOV-DECలో SAతో 2 Test, 3 ODI & 5 T20I, JANలో NZతో 3 ODI & 5 T20I, FEB-MARలో T20 వరల్డ్ కప్ ఆడనున్నారు.

News April 3, 2025

సిరిసిల్ల కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం

image

కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా పై హైకోర్టు మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత తన ఇల్లు మిడ్ మానేరులో పోయిందని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం కవితకు పునరావాసం కల్పించాలని కోర్టు తీర్పు ఇవ్వగా.. ఆ తీర్పు ఇల్లీగల్ ఆర్డర్ అంటూ మహిళపై కలెక్టర్ కేసు బుక్ చేయించారు. దీంతో విషయాన్ని ఆమె కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

News April 3, 2025

వెలిగండ్ల: ఇమ్మడి చెరువు సర్పంచ్ ఆత్మహత్య

image

వెలిగండ్ల మండలంలోని ఇమ్మడి చెరువు గ్రామ సర్పంచ్ తోకల బాలకృష్ణ(37) గురువారం ఉదయం బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వైసీపీ తరఫున సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. బాలకృష్ణ మృతి పట్ల మండలంలోని పలువురు వైసీపీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!