News March 11, 2025
అమలాపురం: ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరిగే హాట్ స్పాట్లను గుర్తించి వాటి నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేశ్ కుమార్ జిల్లా రహదారి భద్రత కమిటీ సభ్యులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన చర్యలపై, అవగాహన కార్యక్రమాల నిర్వహణ పై ఆయన అధికారులకు సూచనలు చేశారు.
Similar News
News November 28, 2025
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతుల్లో ప్రవేశాలకు గడువును డిసెంబర్ 7 వరకు పొడిగించినట్లు జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మండలంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 28, 2025
2045 నాటికి 100% ఎలక్ట్రిక్ బస్సులు!

TG: రాష్ట్రంలో 2045 నాటికి 100% ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు RTC ప్రభుత్వానికి తెలిపింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీ సందర్భంగా ఈ మేరకు వివరించింది. 2035 నాటికి 30% ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామంది. వరంగల్, ఖమ్మం తదితర జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లతో పాటు హైవేలపై ఉన్న డిపోలను ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సెంటర్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించింది.
News November 28, 2025
నేడు క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరగనుంది. విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్, SIPBలో ఆమోదం పొందిన పలు ప్రాజెక్టులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే విశాఖ పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాలపైనా సమగ్రంగా చర్చిస్తారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల సన్నద్ధతమైనా చర్చించే అవకాశం ఉంది.


