News February 8, 2025

అమలాపురం: బీ ఫారం అందుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్

image

ఉభయ గోదావరి జిల్లాల ఎన్డీఏ కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ శనివారం బీ ఫారం అందుకున్నారు. అమరావతిలోని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పళ్ల శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ బీఫారం అందజేశారు. కార్యక్రమంలో కేంద్ర సాంకేతిక సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు పార్టీ నేతలు కార్యక్రమాలు పాల్గొన్నారు.

Similar News

News September 19, 2025

KNR: ఎంగిలిపూల, పెద్ద బతుకమ్మ, దసరా.. తేదీలివే..!

image

పితృ అమావాస్య, ఎంగిలిపూల(చిన్న) బతుకమ్మ ఈనెల 21న ఆదివారం ప్రారంభమవుతుందని కరీంనగర్లోని ప్రధాన వైదిక పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ తెలిపారు. ఈనెల 22 సోమవారం నుంచి శ్రీ దేవీ శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతాయని, 29 సోమవారం సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 2 గురువారం విజయదశమి, దసరా పండుగను జరుపుకోవాలని సూచించారు.

News September 19, 2025

HYD: అవసరమైతే హెల్ప్ లైన్ నంబర్లు కాల్ చేయండి

image

రెండు రోజులుగా నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదనీరు రోడ్లపైకి చేరి ప్రజలను, వాహనచోదకులను ఇబ్బంది పెడుతోంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన సహాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. GHMC 040- 2111 1111, HYD కలెక్టరేట్‌ 90634 23979 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు కోరారు.

News September 19, 2025

58 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 58 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ తదితర పోస్టులున్నాయి. జాబ్స్‌ను బట్టి ఎకనామిక్స్/కామర్స్‌లో డిగ్రీ, MBA/PGDM పూర్తిచేసిన వారు అర్హులు. ఉద్యోగాన్ని బట్టి జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ OCT 9.
వెబ్‌సైట్: <>https://bankofbaroda.bank.in/<<>>
#ShareIt