News March 22, 2025
అమలాపురం: మానవాళి మనుగడుకు నీరే ప్రాణాధారం

మానవాళి మనుగడకు నీరే ప్రాణాధారమని,జల భద్రతతోనే భవిత సురక్షితమనికలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని నాబార్డ్ కోనసీమ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జల సంరక్షణపై దిశా నిర్దేశం చేస్తూ భవిష్యత్తులోఎదుర్కొనబోయే నీటి యాజమాన్య సవాళ్లను గురించి తెలియజేశారు. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకొవాలన్నారు.
Similar News
News December 16, 2025
దేశంలో తగ్గిన నిరుద్యోగ రేటు

నవంబర్ నెలలో దేశ నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గి 4.7 శాతానికి చేరుకుంది. అక్టోబర్లో ఇది 5.2%గా ఉండగా తాజా గణాంకాల్లో 8 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 3.9 శాతానికి, పట్టణాల్లో 6.5 శాతానికి తగ్గింది. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, మహిళల భాగస్వామ్యం పెరగడం ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలని అధికారులు తెలిపారు.
News December 16, 2025
బాపట్ల: 3 ఏళ్ల నిరీక్షణకు.. నేటితో తెర..!

కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 నవంబర్లో విడుదలై నేటికీ దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వం కోర్టు కేసులు పరిష్కరించి అర్హత గల కానిస్టేబుల్ అభ్యర్థుల జాబితాను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన వారికి నేడు మంగళగిరిలోని జరిగే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే బాపట్ల జిల్లా అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి బస్సుల్లో మంగళగిరి చేరుకున్నారు.
News December 16, 2025
కడప: 3 ఏళ్ల నిరీక్షణకు నేటితో తెర.!

ఎన్నో ఏళ్ల నిరీక్షణ.. కఠిన సాధనాలు.. పుస్తకాల పురుగులుగా మారి చదువులు సాగించారు. 2022లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాగా.. 2024 ఎన్నికల వల్ల నియామక ప్రక్రియ ఆలస్యమైంది. NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగస్టు 1న ఫలితాలు విడుదల చేసింది. కడప జిల్లాలో 323 మంది ఎంపికయ్యారు. వీరికి ఇవాళ నియామక పత్రాలను CM చంద్రబాబు అందించనున్నారు. మైలవరం (M) చిన్నకొమెర్ల వాసి భరత్ రెడ్డి రాయలసీమ టాపర్గా నిలిచాడు.


