News March 22, 2025
అమలాపురం: మానవాళి మనుగడుకు నీరే ప్రాణాధారం

మానవాళి మనుగడకు నీరే ప్రాణాధారమని,జల భద్రతతోనే భవిత సురక్షితమనికలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని నాబార్డ్ కోనసీమ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జల సంరక్షణపై దిశా నిర్దేశం చేస్తూ భవిష్యత్తులోఎదుర్కొనబోయే నీటి యాజమాన్య సవాళ్లను గురించి తెలియజేశారు. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకొవాలన్నారు.
Similar News
News April 19, 2025
ముగిసిన ఎంపీ మిథున్ రెడ్డి విచారణ

AP: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణ ముగిసింది. అధికారులు 8 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. అనంతరం వాంగ్మూలంపై ఎంపీ సంతకం తీసుకున్నారు. మరోసారి మిథున్ రెడ్డికి నోటీసులిచ్చి విచారణకు పిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని అధికారులు విచారించారు.
News April 19, 2025
ఖమ్మంలో 10 ఆసుపత్రులు సీజ్ : DMHO

CMRF బిల్లుల జారీలో అవకతవకలకు పాల్పడిన ఖమ్మంలోని 10 ఆసుపత్రులను మూసివేసినట్లు DMHO డా.కళావతి బాయి తెలిపారు. శ్రీ వినాయక, శ్రీకర మల్టీ స్పెషాలిటీ, సాయిమల్టీ స్పెషాలిటీ, వైష్ణవి, సుజాత, ఆరెంజ్, న్యూ అమృత, మేఘ, JR ప్రసాద్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లను రద్దుచేసి మూసివేసినట్లు చెప్పారు. చికిత్సలు చేయకుండానే నకిలీ బిల్లును సృష్టించి CMRF నిధులను కాజేశారని పేర్కొన్నారు.
News April 19, 2025
కర్నూలులో క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం

కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం నూతన క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, మంత్రి టీజీ భరత్‌తో కలిసి ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పాల్గొన్నారు. అనంతరం నూతన ఆస్పత్రి భవనాన్ని సందర్శించి అక్కడ ఉండే వసతుల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆమె సూచించారు.