News February 26, 2026
అమలాపురం: ముగ్గురు ఆర్డీవోల బదిలీ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 26 మంది ఆర్డీవోలను అమరావతి జీఏడీకి అటాచ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో విడుదల చేసింది. కాగా బదిలీ అయిన వారిలో కొత్తపేట ఆర్డీవో శ్రీకర్, రామచంద్రపురం ఆర్డీవో దేవరకొండ అఖిల, అమలాపురం ఆర్డీవో కే.మాధవి ఉన్నారు. వీరి స్థానాల్లో కొత్తవారిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Similar News
News April 14, 2026
పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,470 పెరిగి రూ.1,53,930కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.1,350 ఎగబాకి రూ.1,41,100 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.2,65,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News April 14, 2026
శాంతి భద్రతలను అందించడమే లక్ష్యం: నిర్మల్ ఎస్పీ

నిర్మల్ జిల్లా ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలను అందించడమే తమ లక్ష్యమని ఎస్పీ జానకి అన్నారు. నిర్మల్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ఇందుకోసం రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ‘పోలీస్ అక్క’ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇటీవల జాతీయస్థాయిలో స్కోచ్ అవార్డు అందుకున్నామన్నారు.
News April 14, 2026
రాష్ట్రంలోనే అత్యధిక ఎండలు నల్గొండ జిల్లాలోనే

ఉమ్మడి నల్గొండ జిల్లాలో భానుడు భగభగలాడుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా గుడిపల్లి మండలం గన్‌పూర్‌లో 43.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అడవిదేవులపల్లిలో 43 డిగ్రీలు, కోదండపురంలో 42.9 డిగ్రీలు, గట్టుప్పల్‌లో 42.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఉమ్మడి జిల్లాలోని 112 ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.


