News February 21, 2025
అమలాపురం లాడ్జిలో పోరంకి డాక్టర్ మృతి: సీఐ వీరబాబు

పోరంకికి చెందిన వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కోనసీమ జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది. అమలాపురం టౌన్ సీఐ వీరబాబు వివరాల ప్రకారం.. ప్రేమ విఫలమైన డాక్టర్ యలమంచిలి వెంకట్ జైనేంద్రి ( 28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జైనేంద్రి కిమ్స్ హాస్పిటల్లో వైద్యుడిగా పనిచేశారు. వారం రోజుల నుంచి లాడ్జిలో ఉంటూ విపరీతంగా మద్యం త్రాగి మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Similar News
News November 23, 2025
మచిలీపట్నం: నాన్ వెజ్కు రెక్కలు.!

కార్తీక మాసం ముగియటంతో జిల్లాలో మాంసపు దుకాణాలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. నెల రోజులపాటు మాంసాహారానికి దూరంగా ఉన్న ప్రజలు ఆదివారం మార్కెట్కు వెళ్లి తమకు ఇష్టమైన మాంసాహారం (చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు) కొనుగోలు చేస్తున్నారు. నెల రోజుల పాటు తగ్గిన మాంసాహారాల ధరలు ఆదివారం ఆమాంతం పెరిగిపోయాయి. కేజీ మటన్ రూ.900, చికెన్ రూ. 220, రొయ్యలు రూ.400ల వరకు అమ్ముతున్నారు.
News November 23, 2025
నేడు మచిలీపట్నంలో సత్యసాయి జయంతి వేడుకలు: కలెక్టర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలను ఈనెల 23వ తేదీన జిల్లాలో అధికారిక వేడుకగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నం ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయి సేవా సమితి కార్యాలయం వద్ద సాయంత్రం 5 గంటలకు జిల్లాస్థాయి వేడుకను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో బాబావారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్ కోరారు.