News December 14, 2024

అమలాపురం: విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు: జేసీ 

image

విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు అని విద్యుత్ పొదుపుగా వాడి ఆధా చేస్తూ భావితరాలకు ఇంధన వనరులపై భరోసాను కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతి ప్రజలకు పిలుపు నిచ్చారు. శనివారం అమలాపురం కలెక్టరేట్ నుంచి గడియారపు స్తంభం వరకు నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని జాయింట్ కలెక్టర్ కలెక్టరేట్‌లో జండా ఊపి ప్రారంభించగా ట్రాన్స్‌కో సిబ్బంది ఇంధనాన్ని ప్రతి ఒక్కరూ పొదుపు చేయాలని సూచించారు.

Similar News

News December 4, 2025

18 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి కందుల

image

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు సాధించగలిగామని మంత్రి కందుల దుర్గేశ్ గురువారం ప్రకటించారు. 13వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SLIPB) సమావేశంలో రూ.20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిందన్నారు. 26 సంస్థల ఏర్పాటుకు అనుమతివ్వడం ద్వారా 56,278 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు.

News December 4, 2025

RJY: 13న జాతీయ లోక్ అదాలత్

image

జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్‌.శ్రీలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె రాజమండ్రిలో మాట్లాడారు. త్వరితగతిన, తక్కువ ఖర్చుతో సామాన్యులకు న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమన్నారు. రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకునేందుకు కక్షిదారులు ఈ అవకాశాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు.

News December 4, 2025

నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

image

విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లేవారు నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. చాగల్లు మండలం దారావరం గ్రామానికి చెందిన షైక్ నాగూర్ బేబీ ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో చిక్కుకున్నారు. కలెక్టర్ చొరవ, వికాస సంస్థ కృషి కారణంగా నాగూర్ బేబీ సురక్షితంగా స్వస్థలానికి చేరుకున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమె గురువారం కలెక్టర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.