News February 2, 2025
అమలాపురం: వైసీపీ ఫీజు పోరు ధర్నాకు అనుమతి ఇవ్వాలి

వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఐదో తేదీన కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ఫీజు పోరు ధర్నాకు అనుమతి ఇవ్వాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, డీఎస్పీ ప్రసాదును ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ బొమ్మి ఇజ్రాయిల్ కోరారు. శనివారం ఎస్పీ, డీఎస్పీలను కలిసి అనుమతికి దరఖాస్తు చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్ పర్సన్ నాగేంద్ర మణి, ఎంపీపీ శేషారావు ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు.
Similar News
News February 14, 2025
ఈ నెల 20న కొండనాగులలో జాబ్ మేళా

బల్మూర్ మండలం కొండనాగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 20న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పరంగి రవి ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు, చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులన్నారు. కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు వచ్చే వారు 10th, ఇంటర్, డిగ్రీ మెమోలు, ఆధార్ కార్డు, పాస్ ఫొటోలు తీసుకురావాలన్నారు.
News February 14, 2025
కడపలో దారుణం.. భార్యను కడతేర్చిన భర్త

కడప నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెల్లం మండివీధిలో గురువారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. తన భార్య జమీల భాను(32) తలపై భర్త ఇమ్రాన్ సుత్తితో మోది దారుణంగా హత్య చేశాడు. వీరికి ముగ్గురు సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే కారణమని.. ప్రాథమికంగా పోలీసుల విచారణలో తేలింది. ఘటనా స్థలంలో కడప టూ టౌన్ సీఐ బి. నాగార్జున, ఎస్సై ఎస్.కె.ఎం హుస్సేన్ తమ సిబ్బందితో కలిసి విచారిస్తున్నారు.
News February 14, 2025
అలిపిరి నడక మార్గంలో చిరుత కదలికలు

తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. 7వ మలుపు వద్ద నడకదారి భక్తులకు చిరుత కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. భక్తుల నుంచి సమాచారం అందుకున్న విజిలెన్స్ అటవీశాఖ అధికారులు చిరుత ఆనవాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు. చిరుత కదలికల పట్ల భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. దీంతో భద్రత నడుమ భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు.