News March 30, 2025
అమలాపురం: సోమవారం పీజీఆర్ఎస్ రద్దు

ఈనెల 31న సోమవారం రంజాన్ సెలవు ప్రభుత్వ దినం కావున జిల్లా డివిజన్, మండల స్థాయిలలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాలు నిర్వహించడం లేదని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున ఈ ప్రభుత్వ సెలవు విషయాన్ని అర్జీదారులు గమనించి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించ వలసిందిగా ఆయన ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 25, 2025
BREAKING: ఇస్రో మాజీ ఛైర్మన్ కన్నుమూత

ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్(84) కన్నుమూశారు. ఇవాళ ఉదయం బెంగళూరులోని నివాసంలో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1994 నుంచి 2003 వరకు ఆయన ఇస్రో ఛైర్మన్గా కొనసాగారు. PSLV, జీఎస్ఎల్వీ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించారు. 2020 జాతీయ విద్యా విధానం రూపకల్పన కమిటీకి ఛైర్మన్గా వ్యవహరించారు.
News April 25, 2025
‘సారంగపాణి జాతకం’ రివ్యూ&రేటింగ్

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూప జంటగా తెరకెక్కిన చిత్రం ‘సారంగపాణి జాతకం’ థియేటర్లలో విడుదలైంది. జాతకాలను నమ్మే హీరో పెళ్లి చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడనేది సినిమా స్టోరీ. ప్రియదర్శి సహజ నటన, వెన్నెల కిశోర్, వైవా హర్ష కామెడీ మెప్పిస్తాయి. హీరోయిన్ రూప యాక్టింగ్, ఇంద్రగంటి రచన ఆకట్టుకుంటాయి. కాస్త స్లోగా అనిపించడం, ఊహించేలా కథ సాగడం మైనస్.
WAY2NEWS RATING: 2.75/5.
News April 25, 2025
యుద్ధ భయం.. భారీగా నష్టపోతున్న స్టాక్ మార్కెట్

ఇండియన్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమవుతోంది. ఉదయం నుంచే మందకొడిగా సాగిన సూచీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 567 పాయింట్లు కోల్పోయి 79,234వద్ద సాగుతోంది, నిఫ్టీ 200పాయింట్ల నష్టంతో 24,045వద్ద ట్రేడవుతోంది. భారత్-పాకిస్థాన్ యుద్ధ భయం నేపథ్యంలో మార్కెట్ కుదేలవుతోంది.