News July 12, 2024
అమలాపురం: 10th అమ్మాయికి వేధింపులు.. వ్యక్తి అరెస్ట్

అమలాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 10వ తరగతి బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై కిషోర్ శుక్రవారం తెలిపారు. ఫిర్యాదు అందిన 36 గంటల్లో నిందితుడిని పట్టుకుని అమలాపురం కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించిందని తెలిపారు. అతడిని కొత్తపేట జైలుకి పంపామన్నారు.
Similar News
News October 24, 2025
రాజమండ్రిలో ఈ నెల 25న జాబ్ మేళా

ఈ నెల 25వ తేదీన రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆమె వివరించారు. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 24, 2025
రాజమండ్రి: చింతాలమ్మ ఘాట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

గోదావరి నది ఒడ్డున చింతాలమ్మ ఘాట్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు నల్లటి చారలు గల షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఇతని వయస్సు సుమారు 50-55 సంవత్సరాల మధ్య ఉండవచ్చు. మృతుడి వివరాలు తెలిసినవారు వెంటనే III టౌన్ L&O పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సెల్: 9440796532) లేదా సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సెల్: 9490345517)కు తెలపాలని త్రీ టౌన్ సీఐ కోరారు.
News October 23, 2025
వార్డెన్లు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

తూ.గో. జిల్లాలోని వసతి గృహాల వార్డెన్లు పిల్లల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం స్పష్టం చేశారు. రాజమండ్రిలో బుధవారం ఆమె మాట్లాడారు. పిల్లలను పంపించేటప్పుడు, వారి సంరక్షణకు భద్రతా నిబంధనలు పాటిస్తూ, బంధువుల వివరాలు, తగిన ఆధారాలు నమోదు చేసుకున్న తర్వాతే వారిని పంపించాలని ఆమె ఆదేశించారు.


