News October 14, 2024
అమలాపురం: 133 మద్యం షాపులకు 4,087 దరఖాస్తులు

రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన మద్యం పాలసీకి సంబంధించి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 133 షాపులకు గాను ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా మొత్తం 4,087 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు. ఈనెల 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమలాపురం కలెక్టరేట్లో అభ్యర్థుల సమక్షంలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు.
Similar News
News November 28, 2025
పీఎంఏవై గ్రామీణ సర్వే పూర్తి: కలెక్టర్ కీర్తి

పీఎంఏవై గ్రామీణ 2.0 పథకం కింద ఇళ్లు లేని పేదల గుర్తింపు గడువు నవంబర్ 30 వరకు ఉండటంతో, జిల్లాలో 16,335 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. గృహనిర్మాణ శాఖ సిబ్బంది ద్వారా ‘ఆవాస్ ప్లస్’ యాప్లో సర్వే పూర్తి చేసినట్లు ఆమె ప్రకటించారు. అర్హత కలిగి, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News November 28, 2025
రాజానగరం: ధాన్యం కొనుగోళ్లపై జేసీ ఆరా

రాజానగరం మండలంలోని జి. ఎర్రంపాలెంలో ఈ ఖరీఫ్ సీజన్లో వరి పండించిన రైతులతో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ శుక్రవారం స్వయంగా మాట్లాడారు. పంట దిగుబడి వివరాలను తెలుసుకున్న ఆయన.. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా అని ప్రశ్నించారు. రైస్ మిల్లర్లకు తోలిన ధాన్యానికి సంబంధించిన నగదు 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతుందా లేదా అని ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News November 28, 2025
రాజమండ్రి: అన్నా క్యాంటీన్ను తనిఖీ చేసిన కమిషనర్

అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని, సమయపాలన కచ్చితంగా పాటించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. శుక్రవారం ఆయన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి, రోజువారీ హాజరుపై ఆరా తీశారు. పేదలకు అందించే భోజనం ఎల్లప్పుడూ నాణ్యతగా ఉండేలా చూస్తూ, మెనూను తప్పకుండా పాటించాలని ఆయన ఆదేశించారు.


