News October 14, 2024

అమలాపురం: 133 మద్యం షాపులకు 4,087 దరఖాస్తులు

image

రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన మద్యం పాలసీకి సంబంధించి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 133 షాపులకు గాను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా మొత్తం 4,087 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు. ఈనెల 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమలాపురం కలెక్టరేట్‌లో అభ్యర్థుల సమక్షంలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు.

Similar News

News November 8, 2024

తూ. గో జిల్లాలో 11,13,450 మెట్రిక్ టన్నులు ఇసుక లభ్యత

image

తూ.గో జిల్లాలో 16 ఓపెన్ రీచ్‌ల ద్వారా 11,13,450 మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ పి. ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 22 డిసిల్టేషన్ పాయింట్స్‌లో 4,95,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామన్నారు. అందులో కొవ్వూరు డివిజన్ పరిధిలో ఆరు రీచ్‌లలో 2,52,500 మెట్రిక్ టన్నులు, రాజమండ్రి డివిజన్‌లో 16 రీచ్‌లలో 2,43,500 మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.

News November 8, 2024

రాజమండ్రి ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం UPDATE

image

రాజమండ్రి ఎయిర్ పోర్టులో గురువారం విజయవాడకు చెందిన సుబ్బరాజు వద్ద 6 బుల్లెట్లు గుర్తించారు. పోలీసుల కథనం..తన వద్ద లైసెన్స్ గన్ ఉందని సుబ్బరాజు తెలిపాడు. వ్యాపార పనులకోసం HYD వెళ్తున్నానని, తన బ్యాగులో బుల్లెట్లు ఉన్న విషయం ముందే గుర్తించలేదన్నాడు. దీనిపై ఎస్సై శ్యామ్ సుందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బుల్లెట్లు స్వాధీనం చేసుకుని అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చామన్నారు.

News November 8, 2024

తూ.గో: ‘ధ్రువపత్రంతో ఇసుకను తీసుకెళ్లొచ్చు’

image

రాజమండ్రిలోని కోటిలింగాల, ధవళేశ్వరం గాయత్రీ ర్యాంపు వద్ద ప్రజలకు ఇసుక లభ్యత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ పనులకు ఇసుకను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ట్రాక్టర్ల ద్వారా నేరుగా ఇసుకను తీసుకెళ్లొచ్చన్నారు. జిల్లాలో కొత్తగా కొవ్వూరు డివిజన్ పరిధిలో 8 డిసిల్టేషన్ పాయింట్స్ 4,95,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామన్నారు.