News April 10, 2024
అమలాపురం MLA అభ్యర్థి ప్రకటన

రానున్న ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ అభ్యర్థిగా బీఎస్పీ నుంచి పాలమూరి మోహన్ పోటీ చేస్తారని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి తెలిపారు. ఉప్పలగుప్తం మండలం సరిపెల్ల గ్రామానికి చెందిన మోహన్ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్నారు. పార్టీ ఆశయాల పట్ల ఆకర్షితులై ఇటీవల బీఎస్పీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో నియోజవర్గంలో మోహన్‌ను గెలిపించాలని కోరారు.
Similar News
News November 27, 2025
జిల్లాలో 1.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి: జేసీ

ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ అంచనాగా నిర్ణయించినట్లు జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ వెల్లడించారు. గురువారం నాటికి మొత్తం 34,737 కొనుగోలు కూపన్లు రైతులకు జారీ చేశామని తెలిపారు. జిల్లాలోని 18 మండలాల్లో ఏర్పాటు చేసిన 201 కొనుగోలు కేంద్రాల ద్వారా, ఇప్పటివరకు 21,794 మంది రైతుల నుంచి 1,61,611.920 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News November 27, 2025
తూ.గో రైతులకు ముఖ్య గమనిక

ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించి ఫిర్యాదులు, సందేహాల పరిష్కారం కోసం స్థానిక బొమ్మూరు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందని వెల్లడించారు. రైతులు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏ సమస్య ఉన్నా 8309487151 నంబర్‌కు సంప్రదించి సహాయం పొందవచ్చని సూచించారు.
News November 27, 2025
రాజమండ్రి: సివిల్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్‌కు అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ఏడీ బి. శశాంక తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 30లోగా రాజమండ్రిలోని స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. డిసెంబర్ 5న జరిగే స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి విజయవాడలో శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.


