News April 16, 2025
అమల్లోకి భూభారతి చట్టం: హనుమకొండ కలెక్టర్

ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం జిల్లాలో అమల్లోకి వచ్చిందని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలపై జిల్లాలోని తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు, రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Similar News
News November 16, 2025
కన్నా లేవారా.. కన్నీటి రోదన మిగిల్చిన నీటి కుంట

కళ్లెదుట ఉన్న పిల్లలు నీటి కుంటలో పడి కానారాని లోకాలకెళ్లారని కన్నవారు జీర్ణించుకోలేకపోయారు. కన్నా..లేవరా అంటూ..చిన్నారుల మృతదేహాలపై పడి కన్నవారి కన్నీటి రోదనకు..ఊరంతా వేదనలో పడింది. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి(M) పంటిగుంటకు చెందిన అవినాష్(9), సుధీర్(8)లు ఆదివారం సాయంత్రం నీటి కుంటలో స్నానానికి దిగి ..ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. దీనిపై SI సింహాచలం కేసు నమోదు చేశారు.
News November 16, 2025
సింగరేణిలో 374 మందికి కారుణ్య నియామక పత్రాలు

కొత్తగూడెంలో సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా సందర్భంగా అన్ని ఏరియాలకు సంబంధించి 374 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు స్థానిక MLA కూనంనేని సాంబశివరావు, సింగరేణి C&MD బలరాం చేతుల మీదుగా ఆదివారం అందజేశారు. రామగుండం ఏరియాకు చెందిన 26 మంది నియామక పత్రాలు అందుకున్నారు. ఉన్నతాధికారులు కిరణ్ కుమార్, మురళీధర్ రావు, కలెక్టర్, కార్మిక నేతలు పాల్గొన్నారు.
News November 16, 2025
ఖమ్మం: చెరువులో జారిపడి కాపలాదారుడు మృతి

సత్తుపల్లి మండలం రామానగరం గ్రామంలో బేతుపల్లి చెరువుకు కాపలాదారుడిగా ఉన్న పిల్లి ఆనందరావు(36) ప్రమాదవశాత్తు చెరువులో కాలుజారి పడి మృతిచెందాడు. చెరువు సొసైటీ సభ్యుడిగా కూడా ఉన్న ఆనందరావు జారిపడగా, గమనించిన స్థానికులు అతడిని వెలికితీశారు. అప్పటికే మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.


