News July 1, 2024

అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు: SP

image

తిరుపతి జిల్లాలో నేటి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రకటించారు. తన కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘అందరికీ ఒకటే న్యాయం ఉంటుంది. ప్రతి సిటిజన్ ఎక్కడ నుంచైనా, ఆన్‌లైన్‌లోనైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు. సంబంధిత కాపీని ప్రతి సిటిజన్‌కు ఇవ్వాలి. గతంలో 511 సెక్షన్లు ఉంటే ప్రస్తుతం 358 సెక్షన్లకు కుదించారు’ అని ఎస్పీ చెప్పారు.

Similar News

News November 1, 2025

పరకామణి కేసులో నిందితుడు, ప్రతివాదులకు నోటీసులు…!

image

పరకామణి కేసులో ప్రధాన నిందితుడైన సీవీ రవి కుమార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు ప్రతివాదులైన అప్పటి ఏవీఎస్వో సతీశ్ కుమార్, ఎండోమెంట్ చీఫ్ సెక్రటరీ, ఏపీ లీగల్ సర్వీస్ సెక్రటరీ, సీఐడీ డీజీ, టీటీడీ ఈవో, సీవీఎస్వో, తిరుమల – 1 టౌన్ సీఐలతో పాటు మరి కొందరికి నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని అందులో పేర్కొంది.

News October 31, 2025

CTR: పదేళ్ల నుంచి జైల్లోనే ఆ ఇద్దరు..!

image

చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష పడిన విషయం తెలిసిందే. 2015 నవంబర్ 15న హత్య జరిగిన తర్వాత ఐదుగురు అరెస్ట్ అయ్యారు. పలువురికి కండిషన్ బెయిల్ వచ్చింది. ఇదే కేసులో A3గా ఉన్న జయప్రకాశ్, ఏ4 మంజునాథ్‌కు చాలా కారణాలతో బెయిల్ రాలేదు. కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటికీ జైల్లోనే జీవితం గడుపుతున్నారు. మిగిలిన వాళ్లు జైలు నుంచి విడుదలయ్యారు. తీర్పు రావడంతో మరోసారి జైలుకు వెళ్లారు.

News October 31, 2025

ఇంజినీరింగ్ చదివిన చింటూ.. చివరకు!

image

చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో A1 నిందితుడైన, ఉరిశిక్ష పడ్డ చింటూ అలియాస్ చంద్రశేఖర్.. <<18157620>>కఠారి మోహన్‌కు మేనల్లుడు<<>>. ఇంజినీరింగ్ చేసి మంచి ఉద్యోగం చేసే చింటూ మామకోసం ఆయన వెంట నడిచాడు. సీకే బాబుపై 2007లో జరిగిన బాంబ్ బ్లాస్ట్, గన్ ఫైరింగు కేసులో యావజ్జీవ శిక్ష పడినా, తర్వాత బయటకు వచ్చారు. ఆ తర్వాత అన్ని విషయాల్లో తలదూర్చి వ్యక్తిగత, ఆర్ధిక, పవర్ విభేదాలతో మేనమామ దంపతులను హత్య చేశాడు.