News January 25, 2025
అమీన్పూర్: లారీలో చెలరేగిన మంటలు

అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ జాతీయ రహదారిపై లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మహారాష్ట్ర నుంచి విశాఖపట్నం వెళ్తున్న లారీలో మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ పక్కకు ఆపారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకొని వెంటనే మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
Similar News
News February 16, 2025
మెదక్: ఈనెల 17 నుంచి టెన్త్ ప్రాక్టీస్-2 ఎగ్జామ్స్

పదవ తరగతి విద్యార్థులకు ప్రాక్టీస్-2 పరీక్షలు ఈనెల 17 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ నెల 17న తెలుగు, 18న హిందీ, 19న ఇంగ్లీష్, 20న గణితం, 21న భౌతిక రసాయన శాస్త్రం, 22న జీవశాస్త్రం, 24న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు.
News February 16, 2025
సంగారెడ్డి: పీఎం శ్రీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టండి: కలెక్టర్

జిల్లాలో పీఎంశ్రీ కింద 44 పాఠశాలకు విడుదలైన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో ల్యాలు, ఎల్ఈడి లైటింగ్, తరగతి గదులు, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి వంటి సదుపాయాలు కల్పించాలని చెప్పారు. సమావేశంలో డిఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
News February 16, 2025
నిర్మల్: శెభాష్.. సాయి సహస్ర

నిర్మల్‌లో నిర్మించిన చేపల మార్కెట్ నిరుపయోగంగా ఉంటోంది..రోడ్డుపైనే విక్రయిస్తుంటే ప్రజలు కొంటున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది..ఇది గమనించిన చిన్నారి సాయిసహస్ర నేరుగా కలెక్టర్ దగ్గరకు వెళ్లింది. మార్కెట్ అందుబాటులోకి రాక పడుతున్న ఇబ్బందులు ఆమె దృష్టికి తీసుకెళ్లింది. సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చింది. బాలిక ధైర్యంగా కలెక్టర్ దగ్గరకు వెళ్లడంతో ప్రజలు అభినందిస్తున్నారు.