News May 12, 2024

అమెరికాలో ఖమ్మం యువకుడి మృతి

image

ఖమ్మానికి చెందిన విద్యార్థి లక్కిరెడ్డి రాకేశ్ రెడ్డి అమెరికాలోని ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. వివరాలిలా.. రాకేష్(24) అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు. ఈనెల 8న స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు రాకేశ్‌తో పాటు అతని స్నేహితుడు మునిగిపోయారు. మృతదేహాలు మరుసటి రోజు లభ్యమయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో మృతదేహాన్ని ఖమ్మానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.  

Similar News

News February 8, 2026

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10న ఖమ్మంలో జాబ్ మేళా

image

ఖమ్మం టేకులపల్లి ITI మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈ నెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్ తెలిపారు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. 21-35 సం.ల వయస్సు, ఏదైనా డిగ్రీ కలిగి ఉన్నవారు అర్హులన్నారు. ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.2.4 లక్షల నుంచి రూ.3.5 లక్షలు ఉంటుందని, జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News February 8, 2026

ఖమ్మం: కర్మకాండలకు వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు

image

బంధువుల ఇంట్లో కర్మకాండలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. తిరుమలాయపాలెం మండలం జల్లెపల్లికి చెందిన సుతారీ మేస్త్రి అన్నెపర్తి ఎల్లయ్య శనివారం రాత్రి బైక్‌పై వస్తుండగా.. జిన్నింగ్‌ మిల్లు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయన్ను ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 8, 2026

‘మధిర అంటే నాకు ప్రాణం’ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

image

‘మధిర అంటే నాకు ప్రాణం..నా జన్మధన్యమయ్యేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మధిరలో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మధిర పట్టణాన్ని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా మంచి కౌన్సిలర్లను ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు.