News March 14, 2025

అమెరికాలో తిరుపతి జిల్లా యువకుడిపై కాల్పులు

image

అమెరికాలో తిరుపతి జిల్లా యువకుడిపై కాల్పులు జరిగాయి. ఏర్పేడు (M) గోవిందవరానికి చెందిన మోహన్ అమెరికాలోని మెఫ్పిస్, టెనస్సీలో ఉంటున్నారు. నిన్న రాత్రి తన ఫ్రెండ్‌తో కారులో వెళ్లగా.. దుండగుడు తుపాకీతో కాల్చాడు. మోహన్ భుజం, చేతికి బుల్లెట్లు తగిలాయి. గాయాలతోనే కారు నడిపి ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై శ్రీకాళహస్తి MLA బొజ్జల ఆరా తీశారు. అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

Similar News

News November 28, 2025

పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలలకు 35 కొత్త కంప్యూటర్లు

image

పెద్దపల్లి జిల్లా పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడానికి పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ 35 డెల్ వాస్ట్రో i3 కంప్యూటర్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. కలెక్టర్ అనుమతితో వచ్చిన ఈ కంప్యూటర్లు నవంబర్ 30లోపు సంబంధిత పాఠశాలలకు చేరేలా టీమ్‌లను ఏర్పాటు చేయాలని శాఖ ఆదేశించింది. పంపిణీ చర్యలపై వివరాల కోసం SIET సెక్షన్ అధికారి మల్లేష్ గౌడ్ (9959262737) ను సంప్రదించాలని ప్రకటించింది.

News November 28, 2025

కోటిలింగాల ఆలయానికి ₹2,73,695 ఆదాయం

image

కార్తీకమాసం ముగిసిన సందర్భంగా కోటిలింగాల కోటేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి మొత్తం రూ.2,73,695 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆలయ అధికారులు హామీ ఇచ్చారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రాజా మొగిలి, ఈవో కాంతరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రమేష్ పాల్గొన్నారు.

News November 28, 2025

భోగాపురం కనెక్టివిటీపై బ్రేకులు

image

భోగాపురం విమానాశ్రయానికి కనెక్టివిటీ మెరుగుపర్చేందుకు VMRDA ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ రహదారుల ప్రాజెక్ట్‌పై పురోగతి కనబడటం లేదు. VMRDA ఏడాది క్రితం రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేసింది. ట్రాఫిక్‌ను అరికట్టాలనే లక్ష్యంతో ప్లాన్ చేసినా.. భూసేకరణ, వివాదాలు పనులకు అడ్డంకిగా మారాయి. ఏడాది క్రితమే ప్రాసెస్‌ ప్రారంభమైనా పురోగతి కనబడకపోవడంతో ట్రాఫిక్‌ తిప్పలు తప్పవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.