News March 14, 2025

అమెరికాలో తిరుపతి జిల్లా యువకుడిపై కాల్పులు

image

అమెరికాలో తిరుపతి జిల్లా యువకుడిపై కాల్పులు జరిగాయి. ఏర్పేడు (M) గోవిందవరానికి చెందిన మోహన్ అమెరికాలోని మెఫ్పిస్, టెనస్సీలో ఉంటున్నారు. నిన్న రాత్రి తన ఫ్రెండ్‌తో కారులో వెళ్లగా.. దుండగుడు తుపాకీతో కాల్చాడు. మోహన్ భుజం, చేతికి బుల్లెట్లు తగిలాయి. గాయాలతోనే కారు నడిపి ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై శ్రీకాళహస్తి MLA బొజ్జల ఆరా తీశారు. అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

Similar News

News February 10, 2026

HYD: నిరసనలు.. ఆందోళనలతో గడిచిపోయింది!

image

నేటితో ముగియనున్న GHMC పాలక మండలి.. నిరసనలు, ఆందోళనలతోనే గడిచిపోయింది. ఐదేళ్ల పదవీ కాలంలో పాలకమండలి 23సార్లు సమావేశమైంది. ఏడాదికి సరాసరి 4.6 సార్లు జరిగినట్లు లెక్క. ఈ సమావేశాలు జరుగుతున్నపుడు ప్రతిపక్ష పార్టీల సభ్యుల ఆందోళనలు, నిరసనలు హోరెత్తాయి. దీంతో సగం సమావేశాలు వాటితోనే ముగిశాయి. ఈ 5ఏళ్లలో 415 తీర్మానాలను పాలకమండలి ఆమోదించింది.

News February 10, 2026

చెరకు రసంతో కాంతివంతమైన చర్మం

image

చర్మకాంతిని పెంచడంలో చెరకురసం ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. * చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టి కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టించి, పావుగంట తర్వాత కడిగేస్తే నల్లమచ్చలు తొలగిపోతాయి. * చెరకు రసంలో కొద్దిగా తేనె కలిపి, ముఖానికి మసాజ్ చేసి, 10నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. * కాఫీపొడికి కాస్త చెరకురసాన్ని చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుంది.

News February 10, 2026

వ్యవసాయంలో విత్తనశుద్ధితో ప్రయోజనాలు

image

వ్యవసాయంలో విత్తనశుద్ధి చేయడం వల్ల.. విత్తనాలు, నేల ద్వారా ఆశించే తెగుళ్లు, పురుగుల నుంచి పంటను సంరక్షించవచ్చు. మొక్కలలో మొలకశాతం పెరుగుతుంది. పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరుగుతాయి. విత్తనాలు త్వరగా మొలకెత్తి ఏకరీతిగా ఎదుగుతాయి. శుద్ధి చేయడం వల్ల విత్తనాలను ఎక్కువకాలం నిల్వ చేయవచ్చు.