News January 21, 2025
అమెరికాలో దొంగల కాల్పులు.. నల్గొండ యువకుడి మృతి

అమెరికాలో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో నల్గొండ జిల్లాకు చెందిన రవితేజ సోమవారం <<15202639>>మృతిచెందాడు.<<>> రాబరీ కేసులో పారిపోతున్న దొంగలు అతడు ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిపి చంపేశారు. అనంతరం ఆ కారులోనే పారిపోయారు. రవితేజ స్వస్థలం చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామం. గతంలో నల్గొండలో ఉన్న రవితేజ ఫ్యామిలీ ఇటీవల HYDకు షిఫ్ట్ అయ్యారు. ఇంతలోనే కుమారుడిని కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Similar News
News February 12, 2025
ఈతకు వచ్చి మునుగోడు యువకుడి మృతి

నల్గొండ మండలం నర్సింగ్ భట్లలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వచ్చి మునుగోడు మండలం గూడపూర్‌కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడపూర్‌కు చెందిన వ్యక్తి నర్సింగ్ భట్లలోని AMRP కాలువలోకి ఈతకు వచ్చి నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు.
News February 12, 2025
నేడు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి

నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి NLG జిల్లాకు రానున్నారు. ఉదయం 7:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9:30 గంటలకు నార్కెట్ పల్లి మండలం గోపలాయిపల్లి గ్రామంలోని శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు. అనంతరం తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన రాజిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించనున్నారు.
News February 12, 2025
NLG: మహిళా టీచర్ల సమస్యల పరిష్కారానికే పోటీ: అర్వ స్వాతి

మహిళా టీచర్ల సమస్యలను కౌన్సిల్లో తీర్చేందుకే స్వతంత్ర మహిళ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి అర్వ స్వాతి తెలిపారు. తన నామినేషన్ స్క్రూటినీలో ఓకే అయిన సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో 4 సార్లు జరిగిన ఎన్నికలలో మహిళలు పోటీలో లేరని, మెజారిటీ మహిళలు సంఘ బాధ్యులుగా లేని కారణంగా ఏ సంఘం మహిళా అభ్యర్థులను పోటీకి నిలపలేదని, పురుష అభ్యర్థులను గెలిపిస్తే మహిళల సమస్యలు పరిష్కరించలేదన్నారు.