News August 19, 2024
అమెరికాలో ప్రకాశం టెకీ మృతి
ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బుచ్చిబాబు(40) కాలిఫోర్నియా బీచ్‌లో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. 20 నెలల క్రితం ఆయన అమెరికా వెళ్లారు. ఆరు నెలల క్రితం భార్య, ఐదేళ్ల కుమారుడు కూడా అమెరికాకు వెళ్లారు. శనివారం బీచ్‌కి వెళ్లి స్నానం చేస్తుండగా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ముండ్లమూరులోని బుచ్చిబాబు తల్లిదండ్రులకు ఆదివారం ఈ సమాచారం అందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Similar News
News September 11, 2024
కొత్తపట్నం: నమ్మించి సహజీవనం.. మరో పెళ్లికి యత్నం
కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామానికి చెందిన పులి నాగార్జున ఓ యువతిని ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడేవాడు. 10ఏళ్ల తర్వాత ఇటీవల ఆమె వద్దకు వెళ్లి నమ్మించి సహజీవనం చేశాడు. కొద్ది రోజుల క్రితం మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు పూనుకున్నాడు. దీనిపై ఆమె ప్రశ్నిస్తే హంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడటంతో యువతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నాగార్జునతోపాటు, మరో అయిదుగురిపై కేసు నమోదు చేశారు.
News September 11, 2024
ప్రకాశం: జిల్లాలో రైతుల చూపు నర్సరీల వైపు
ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు నర్సరీల నుంచి నారు, మొక్కలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గతంలో పడినంత కష్టం లేకుండా ప్రైవేట్ నర్సరీల నుంచి తెచ్చుకుంటున్నారు. దీని వల్ల సమయం, ఖర్చు కలిసివస్తుందని, నారు ఒకే ఎత్తులో ఉంటుందని, నాణ్యతగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 2023-24 మధ్య మిరప 95,129 ఎకరాల్లో, టమోటా 1746 ఎకరాల్లో సాగైనట్లుగా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు.
News September 11, 2024
నేడు దోర్నాలకు రానున్న కలెక్టర్
ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం దోర్నాల మండలంలో పర్యటించనున్నట్లు మంగళవారం అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు మండలంలోని చిన్న గుడిపాడు సమీపంలో గల ఆర్డీటి కార్యాలయంలో నిర్వహించే పీఎం-జన్ మన్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొననున్నట్లు తెలిపారు.