News March 17, 2025
అమెరికాలో ప్రమాదం.. రంగారెడ్డి జిల్లా వాసులు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు చనిపోయారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి(35), మనవడు హార్వీన్ (6), సునీత (56) మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడం పట్ల టేకులపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 24, 2025
అనకాపల్లి: రిజర్వాయర్లో గల్లంతైన యువకుడు మృతదేహం లభ్యం

రావికమతం మండలం కళ్యాణపులోవ రిజర్వాయర్లో గల్లంతైన మృతదేహం సోమవారం ఉదయం లభ్యమయింది. కొత్తకోట గ్రామానికి చెందిన గుమ్ముడు వాసు (29) ఆదివారం రిజర్వాయర్లో దిగి గల్లంతైన విషయం తెలిసిందే. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. తిరిగి కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం రావికమతం అగ్రిమాపక కేంద్ర సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించారు.
News November 24, 2025
తెనాలి పన్నీర్ జిలేబీ.. యమా టెస్ట్ గురూ.!

ఆంధ్రాప్యారిస్ తెనాలి అంటేనే నోరూరించే జిలేబీకి ఎంతో ఫేమస్. బెల్లం జిలేబీ, పంచదార జిలేబీ ఇప్పటి వరకు తెలుసు. లేటెస్ట్గా వాటి సరసన చేరింది పన్నీర్ జిలేబీ. పట్టణంలోని జిలేబీ కొట్ల బజారులో శని, ఆదివారాల్లో స్పెషల్ పన్నీర్ జిలేబీని సిద్ధం చేస్తున్నారు. కిలో రూ.600 చొప్పున లభిస్తున్న నోరూరించే పన్నీర్ జిలేబీని ప్రజలు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. మీరూ టేస్ట్ చేస్తే కామెంట్ చేయండి..!
News November 24, 2025
పార్వతీపురం: ‘నలుగురు కార్యదర్శులు సస్పెండ్’

కొమరాడలో సచివాలయంలో విధులు నిర్వహించిన నలుగురు కార్యదర్శులపై సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు ఎంపీడీవో రమేశ్ తెలిపారు. గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం జరిగాయి అన్న అభియోగంపై గతంలో పనిచేసిన కార్యదర్శులు శ్రీనివాసరావు, వైకుంఠరావు, గణపతితోపాటు ప్రస్తుత కార్యదర్శి నాగరాజును కూడా సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.


