News March 23, 2025
అమెరికాలో మెడికల్ సీటు సాధించిన ఖమ్మం విద్యార్థి

ఖమ్మం నగరానికి చెందిన రాజావాసిరెడ్డి-నేహాశివాని అమెరికాలోని ప్రతిష్టాత్మక వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయంలో ఎండీ జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ సీటు సాధించారు. ఇటీవల విడుదల చేసిన ఫలితాలలో ఆమె ప్రతిభ చాటారు. వివిధ దశలలో నిర్వహించే మెడికల్ లైసెన్సింగ్ ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రతిభను కనబరచి మొదటి ప్రయత్నంలోనే సీటు సాధించడం విశేషం. ఆమె నెలకు రూ.6వేల డాలర్ల పారితోషకం అందుకోనున్నారు.
Similar News
News March 29, 2025
ఉగాదిని సంతోషంగా జరుపుకోవాలి: తుమ్మల

ఖమ్మం: కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. స్తంభాద్రి పురోహిత సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పంచాంగ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు లక్ష్మి, కమర్తపు మురళి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సాదు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
News March 29, 2025
నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలి: కలెక్టర్

KMM: ఏప్రిల్ 5 లోపు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆసక్తి అర్హత గల సంబంధిత SC నిరుద్యోగ యువత https://tgobmmsnew.cgg.gov.in వెబ్సైట్ నందు ఏప్రిల్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అభ్యర్థులు పూరించిన దరఖాస్తు ఫారంను సంబందిత ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్పించాలన్నారు.
News March 29, 2025
నేటి నుంచి నాలుగు రోజులపాటు సెలవులు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మార్కెట్ శాఖ ఉన్నత శ్రేణి కార్యదర్శి నేటి నుంచి నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించారు. శనివారం (ఇవాళ) అమావాస్య, ఈనెల 30న ఉగాది, 31న రంజాన్, ఏప్రిల్ 1న రంజాన్ పండుగ తదుపరి రోజు సందర్భంగా సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి మార్కెట్ ఏప్రిల్ 2న పునః ప్రారంభం అవుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని మార్కెట్ శాఖ అధికారులు పేర్కొన్నారు.